అలుపెరగని పోరాటం.. అరుదైన వ్యక్తిత్వం.. తనని తాను ఎప్పటికప్పుడు చెక్కుకునే శిల్పి.. అదీకాక తండ్రి కలను నెరవేర్చిన ఓ కొడుకు కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ కొడుకు ఎవరో కాదు.. హైదరాబాద్ వేదికగా భారత్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేసిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్. క్రికెట్ ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టినప్పటికీ అతడికి అవకాశాలు అంత సులభంగా ఏమీ దక్కలేదు. తండ్రి మార్క్ స్టార్ డొమెస్టిక్ ప్లేయర్. అంతే కాదు బ్రేస్ వెల్ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు న్యూజిలాండ్ దేశవాలీ క్రికెట్ లో రాణించిన వారే. వారి స్ఫూర్తితోనే తాను క్రికెటర్ అవ్వాలనుకున్నాడు బ్రేస్ వెల్. అంతర్జాతీయ క్రికెటర్ అవ్వాలనుకున్న తన తండ్రి కలను నిజం చేశాడు. దాని కోసం ఓ పోరాటాన్నే చేశాడు బ్రేస్ వెల్.
బ్రేస్ వెల్.. ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో మారుమ్రోగుతున్న పేరు. క్రికెట్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఎవరూ ఆడలేదు. బ్రేస్ వెల్ తండ్రి మార్క్ కివీస్ తరపున డొమెస్టిక్ ఫార్మాట్ లో స్టార్ ప్లేయర్ గా వెలుగొందాడు. కానీ జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేక పోయాడు. న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ జట్టుకు ఆడాలన్న మార్క్ కల కలగానే మిగిలిపోయింది. దాంతో ఎలాగైన తన తండ్రి కలను నిజయం చెయ్యాలని కంకణం కట్టకున్నాడు బ్రేస్ వెల్. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. 2022 మార్చిలో నెదర్లాండ్స్ పై వన్డే అరంగేట్రం చేశాడు.
మెుదట కీపర్ గా కివీస్ జట్టులోకి వచ్చాడు బ్రేస్ వెల్. కానీ అప్పటికే జట్టులో కాన్వే, టామ్ లాథమ్ లు కీపర్ లుగా ఉన్నారు. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించిన బ్రేస్ వెల్.. కీపర్ నుంచి ఆల్ రౌండర్ గా మారాడు. కివీస్ జట్టులో ఆల్ రౌండర్ల కొరత ఉందని గ్రహించి.. అటువైపు అడుగులు వేశాడు. అప్పటి నుంచి అటు బ్యాట్ తో ఇటు బాల్ తో రాణిస్తున్నాడు బ్రేస్ వెల్. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ కివీస్ జట్టులో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతూ.. కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో అందరు ఓడిపోయింది అనుకుంటున్న తరునంలో అనూహ్యంగా చెలరేగాడు బ్రేస్ వెల్. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నకివీస్ జట్టు 337 పరుగులు చేసింది అంటే అది బ్రేస్ వెల్ విధ్వంసమే.
Trouble in the chase?
📞 Michael Bracewell#INDvNZ #MichaelBracewell pic.twitter.com/xTFX7p43qI
— ESPNcricinfo (@ESPNcricinfo) January 19, 2023
ఈ మ్యాచ్ లో బ్రేస్ వెల్ కేవలం 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. అతడే కనుక అవుట్ కాకుంటే.. టీమిండియాకు ఓటమి తప్పేదు కాదు. అయితే బ్రేస్ వెల్ ఇలా చెలరేగడం ఇదే మెుదటి సారికాదు. గతంలో కూడా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది కివీస్ జట్టు. అయితే 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన బ్రేస్ వెల్.. 82 బంతుల్లో 127 రన్స్ తో చెలరేగాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వార టీమిండియా మిస్టర్ కూల్ ధోని రికార్డును సమం చేశాడు బ్రేస్ వెల్. 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సెంచరీలు చేసిన జాబితాలో ధోని సరసన చేరాడు. తన తండ్రి కలను నెరవేర్చడం కోసం బ్రేస్ వెల్ పడిన కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Michael Bracewell went level with MS Dhoni’s record during his outstanding hundred in Hyderabad 😯
Details 👇#INDvNZhttps://t.co/HdXQyRT1qH
— ICC (@ICC) January 18, 2023