న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారి పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే పురుష, మహిళా క్రికెటర్లకు ఇకపై ఒకే విధమైన కాంట్రాక్ట్ ఇవ్వనున్నారు. వారి జీతభత్యాల్లో ఎలాంటి తేడా ఇకపై ఉండబోదు. అలాగే దేశవాళీ క్రికెట్‌లోనూ ఇదే విధానం అమలు చేయనున్నారు. నిజంగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమనే చెప్పాలి.
ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్ గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించింది. ఈ నిర్ణయం వెలువడిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు కల్పించడమనే నిర్ణయం చారిత్రాత్మకం. దీని ద్వారా ఉమెన్ క్రికెటర్లకు కూడా గుర్తింపు దక్కుతుంది. దేశంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే యువతకు ఇది ఎంతో స్ఫూర్తినిస్తుంది. తద్వారా చాలా మంది క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకుంటారు.’ అని తెలిపింది. ఇదే విషయమై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. కేన్ మామ స్పందిస్తూ.. ‘ప్రస్తుత ఆటగాళ్లు మనకంటే ముందు ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగించడం.. రేపటి తరం ఆటగాళ్లకు అన్ని స్థాయిలలో మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం దానిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది..’ అని తెలిపాడు.
తాజా ఒప్పందం రాబోయే ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. కొత్త ఒప్పందం ప్రకారం.. న్యూజిలాండ్‌లో డొమెస్టిక్ కాంట్రాక్టుల సంఖ్య 54 నుంచి 72 కు పెరగనుంది. దేశవాళీలో మహిళల వార్షిక కాంట్రాక్టుల సంఖ్య కూడా 9 నుంచి 12కు పెంచారు. ఇక న్యూజిలాండ్ బోర్డును స్ఫూర్తిగా తీసుకుని మిగతా బోర్డులు కూడా ఈ దిశగా ముందడుగు వేయాలని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Landmark day for all levels of cricket in New Zealand 🏏 #CricketNationhttps://t.co/WCSjTAl9Q8
— BLACKCAPS (@BLACKCAPS) July 4, 2022
Long overdue but a big step nonetheless🙌
Pay parity is now a reality in New Zealand cricket.#CricketNation #Cricket pic.twitter.com/US1zi2Sbu8
— Women’s CricZone (@WomensCricZone) July 5, 2022