న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. కివీస్ బ్యాటర్లను వణికిస్తూ.. కేవలం 108 పరుగులకే ఆలౌట్ చేసి పడేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. కాస్త మతిమరుపు గురైన మంచి నిర్ణయమే తీసుకున్నాడు. బ్యాటింగ్ ఎంచుకోవాలా? బౌలింగ్ తీసుకోవాలా? అనే విషయాన్ని టాస్‌కి ముందు టీమ్ మీటింగ్‌లో చర్చించినా.. మర్చిపోయి.. చివరికి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇలా రోహిత్ కన్ఫ్యూజన్‌కు గురైనా.. బౌలర్లు మాత్రం రోహిత్ నిర్ణయం సరైందే అని నిరూపించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఫిన్ అలెన్‌ను బౌల్డ్ చేసి మొహమ్మద్ షమీ కివీస్ పతనాన్ని శాసించాడు. షమీ వేసిన బాటలోనే సిరాజ్ కూడా నడిచాడు.. హెన్రీ నికోలస్‌ను 6వ ఓవర్‌లో అవుట్ చేశాడు.
ఇక్కడి నుంచి న్యూజిలాండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 7వ ఓవర్‌లో డార్లీ మిచెల్, 10వ ఓవర్‌లో కాన్వె, టామ్ లాథమ్ అవుట్ అవ్వడంతో.. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. గ్లెన్ ఫిలిప్స్(36), మిచెల్ బ్రాస్‌వెల్(22), మిచెల్ సాంట్నర్(27) అంతో ఇంతో పరుగుల చేయడంతో న్యూజిలాండ్ 108 పరుగులైన చేయగలిగింది. షమీ 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్ 2, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. కొంతకాలంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సిరాజ్ ఈ మ్యాచ్‌లోనూ 6 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. షమీ 6 ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి 3 వికెట్ల తీసుకున్నాడు. సుందర్ 3 ఓవర్లు మాత్రమే వేసి కేవలం 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో నెగ్గిన భారత్.. 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉంది. మరి టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Innings Break!
A brilliant bowling performance from #TeamIndia 👏 👏
3⃣ wickets for @MdShami11
2⃣ wickets each for @hardikpandya7 & @Sundarwashi5
1⃣ wicket each for @mdsirajofficial, @imkuldeep18 & @imShardScorecard ▶️ https://t.co/tdhWDoSwrZ #INDvNZ | @mastercardindia pic.twitter.com/0NHFrDbIQT
— BCCI (@BCCI) January 21, 2023