టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న విషయంలో తీవ్ర విమర్శలు, ఆరోపనలు ఎదుర్కొన్న గంగూలీ తాజాగా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఆయన సెలక్షన్ మీటింగ్స్‌కు హాజరవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బోర్డులోని ఓ వర్గం ఇదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టిపారేయగా… గంగూలీ వ్యవహార శైలి దురదృష్టకరమంటూ మరో వర్గం జాతీయ మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.
What’s Ganguly’s role in selection meeting?
This is clearly against BCCI’s constitution. pic.twitter.com/9rjjoLNESq— Shivam Aks 🇮🇳 (@AksShivam) January 31, 2022
ఓ జర్నలిస్టు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతూ ఓ వ్యక్తి అక్కడి అంశాలను ప్రభావితం చేస్తున్నారు. నిజానికి వీటన్నింటికి దూరంగా ఉండాలని ఆయనకు తెలుసు. అయినా కూడా అలాగే చేస్తున్నారు. కెప్టెన్, కోచ్ నిస్సహాయులుగా మారిపోయారు. వాళ్లేమీ చేయలేరు కదా! అసలు ఆయనకు అక్కడేం పని. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్‌లో ఎక్కడా గంగూలీ ప్రస్తావించపోయినప్పటికీ… ఆ వ్యక్తి గంగూలీనే అంటూ టీమిండియా అభిమానులు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేస్తూ… ‘‘మొన్న కోహ్లి విషయంలో అలా.. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇలా… గంగూలీ గద్దె దిగే సమయం ఆసన్నమైంది.’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
The pretence of Sourav Ganguly got exposed. pic.twitter.com/m1bTtIYCd0
— Pari (@BluntIndianGal) January 20, 2022
కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడు సెలక్షన్ విషయంలో జోక్యం చేసుకోకూడదు. అయితే, కార్యదర్శికి మాత్రం సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే వెసలుబాటు ఉంటుంది. ఇక జట్టు ఎంపిక, కెప్టెన్ తదితర అంశాలకు సంబంధించి సెలక్షన్ కమిటీదే అంతిమ నిర్ణయం. కెప్టెన్, కోచ్‌లతో చర్చించి జట్టును ఖరారు చేస్తుంది. మరి గంగూలీ సెలెక‌్షన్ సమావేశాలకు హాజరైనట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.