సౌత్ ఆఫ్రికా సిరీస్ లో రుజురాజ్ గైక్వాడ్ ప్రదర్శనతో కాకుండా ప్రవర్తనతో బాగా వైరల్ అవుతున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలింగించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఆరంభం నుంచి కాస్త వర్షం గ్యాప్ ఇచ్చినా.. మ్యాచ్ కొనసాగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ ఎంతగానో శ్రమించింది. చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్ ను ఎంతో చక్కగా మ్యాచ్ ఆండేదుకు వీలుగా సిద్ధం చేశారు. నిజానికి ఆఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్ల కంటే గ్రౌండ్ స్టాఫే ఎంతగానో శ్రమించారు. అయితే అలాంటి స్టాఫ్ విషయంలో రుజురాజ్ గౌక్వాడ్ ప్రవర్తించిన తీరుతో ప్రస్తుతం అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు.
విషయం ఏంటంటే.. వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగిన సమయంలో హెల్మెట్, చేతికి గ్లౌజులతో రుజురాజ్ డగౌట్‌లో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ లో ఒకరు రుతురాజ్ గైక్వాడ్ తో సెల్ఫీ దిగేందుకు దగ్గరకు వెళ్లాడు. అలా పక్కన కూర్చున్న స్టాఫ్ సిబ్బందిని రుజురాజ్ ఎంతో దురుసుగా నెట్టేశాడు. అక్కడితో ఆగకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ చేతులతో సైగలు చేశాడు. ఆ విషయం మొత్తం కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా మారడంతో అంతా రుజురాత్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని సందర్భాలను, ఫొటోలను షేర్ చేస్తూ హితవు పలుకుతున్నారు.
Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this 😔#RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX
— Arnav (@imarnav_904) June 19, 2022
గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా వర్షం పడటంతో.. గ్రౌండ్ లో అడుగులు పడకుండా ఉండేందుకు గ్రౌండ్ స్టాఫ్ మైదానంలో కష్టపడుతున్నారు. అది చూసిన సురేశ్ రైనా గ్రౌండ్ స్టాఫ్ తో కలిసి వారికి సహాయం చేశాడు. సురేశ్ రైనా లాంటి స్టార్ ప్లేయర్లే గ్రౌండ్ స్టాఫ్ తో అంత హుందాగా ప్రవర్తిస్తే.. అప్పుడే టీమిండియాలో సరైన స్థానం రాలేదు, ఒకటి రెండు ఐపీఎల్ మ్యాచుల్లో మెరవగానే కళ్లు నెత్తికెక్కినట్లు ఉన్నాయిగా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు రోహిత్ శర్మ, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు గతంలో గ్రౌండ్ స్టాఫ్ తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వీరికంటే నువ్వు గొప్పేం కాదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ తో రుజురాజ్ గైక్వాడ్ ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Proud of u idolo 💓#sureshraina pic.twitter.com/vRPdegWo8h
— virrrral (@CricViral3) June 19, 2022
This is Suresh Raina for you !! #SureshRaina @ImRaina pic.twitter.com/OEzVM73pWH
— Raina Fan ❤️ (@RainaaFann) June 19, 2022
Not anyone can treat like Rohit Sharma ❤️ pic.twitter.com/BzyzG9zmLp
— Arnav (@imarnav_904) June 19, 2022
#RuturajGaikwad you have to learn more from your indian team mates#sanjusamson #BCCI #INDvsSA pic.twitter.com/bM0JjlGUaj
— amayprem 25 (@Amayprem333) June 19, 2022
Ruturaj Gaikwad showing attitude while taking selfie with ‘groundsman’ not anyone can treat everyone equal like Rohit Sharma ❤️#INDvSA #IndvsSa pic.twitter.com/6zoZzOaJdR
— Arun Dhanush (@ArunDha69743194) June 19, 2022
Ruturaj Gaikwad learn from MS Dhoni the Greatest Skipper Indian Cricket! #CSK #INDvsSA pic.twitter.com/Gm4gmKkQj8
— OHO Memes (@OhoMemes) June 19, 2022