హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతానికి విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతి కల్పించారు. ఇంగ్లాండ్ తో జరగనున్న ఏకైక టెస్టుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టులో రోహిత్ శర్మ కనిపించలేదు. రోహిత్ మళ్లీ గాయాల పాలయ్యాడా? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం టీ20 సిరీస్‌లో ఉన్న పంత్, శ్రేయాస్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి జూన్ 20న ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత నుంచి రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయ్యి.
టీ20 వరల్ట్ కప్ తర్వాత రోహిత్ శర్మ గాయాల కారణంగా విశ్రాంతి తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా టూర్ కి కూడా వెళ్లలేదు. స్వదేశంలో జరిగిన టోర్నీల్లో పాల్గొన్నా.. పెద్దగా రాణించింది లేదు. హిట్ మ్యాన్ గత కొంతకాలంగా ఫామ్ లో లేని విషయం తెలిసిందే. తిరిగి ట్రాక్ లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ క్యాంపులో ఉండకుండా.. గల్లీ క్రికెట్ ఆడుకుంటూ కనిపించడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే అలా గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుందంటూ హితవు పలుకుతున్నారు. అయితే రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతూ కనిపించిన వీడియో రెండేళ్ల క్రితంది.. ఇప్పుడు వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
England bound ✈️
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
— BCCI (@BCCI) June 16, 2022
అందరితో కలిసి వెళ్లక ఎక్స్‌ట్రా సెలవులు తీసుకోవడం ఎందుకు? అసలు సెలవులు ఇవ్వడమే ఎక్కువ మళ్లీ వాటిల్లో పొడిగింపు కూడానా? అంటూ విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మకు కళ్లు నెత్తికి ఎక్కాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ లో జట్టు మొత్తం ఒక టెస్టు, మూడు టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా సారధ్యంలోని జట్టు ఐర్లాండ్ తో రెండు టీ20ల సిరీస్‌లో పాల్గొననుంది. రోహిత్ శర్మపై వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma playing gully cricket at woreli, Mumbai. pic.twitter.com/vuHLIVno6D
— Johns. (@CricCrazyJ0hns) June 14, 2022