గురువారం సౌత్ ఆఫ్రికా- భారత్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ కు ఓ విశిష్టత ఉంది. ఆ మ్యాచ్ టీమిండియాకి 160వ టీ20 మ్యాచ్. డిసెంబరు 1, 2006లో టీమిండియా తమ తొలి టీ20 మ్యాచ్ సౌత్ ఆఫ్రికాపై ఆడింది. ఆ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అప్పటి మ్యాచ్ కి ఇప్పటి మ్యాచ్ కి రెండు జట్ల నుంచి కేవలం దినేష్ కార్తీక్ ఒక్కడే రిపీట్ ప్లేయర్. 2006లో తొలి టీ20 ఆడిన దినేష్ కార్తీక్.. మళ్లీ 16 ఏళ్ల తర్వాత టీమిండియా 160వ టీ20 మ్యాచ్ లోనూ భాగం కావడం గమనార్హం. ఆ మ్యాచ్ లో దినేష్ కార్తీక్.. 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
అంతేకాకుండా దినేష్ కార్తీక్ వీరేంద్ర సెహ్వాగ్, అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, ధోనీ, విరాట్ కోహ్లీల సారథ్యంలో ఆడిన పంత్.. తాజాగా రిషబ్ పంత్ కెప్టెన్సీలో కూడా ఆడటం విశేషం. ఇప్పుడు పంత్ వయసు విషయంలో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. దినేష్ కార్తీక్ వయసు, అనుభవంతో పంత్ వయసును పోలుస్తూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Age of the players selected in the current T20 squad when India won the World Cup in 2007 and Dinesh Karthik (22 years) was part of it.
Hooda = 12, Rahul = 15, Ruturaj = 10, Shreyas = 12, Axar = 13, Hardik = 13, V. Iyer = 12, Kishan = 8, Pant = 9, Arshdeep = 9 pic.twitter.com/9ejz9tDiw2
— Abhishek Ojha (@vicharabhio) June 8, 2022
ప్రస్తుతం దినేష్ కార్తీక్ వయసు 37 సంవత్సరాలు. దినేష్ కార్తీక్ తన తొలి టీ20 ఆడే సమయంలో అతని వయసు 20 సంవత్సరాలు. అయితే ఆ సమయంలో రిషబ్ పంత్ వయసు కేవలం ఏడేళ్లేనని.. పంత్ చెడ్డీలు వేసుకుని రెండో తరగతిలో కూర్చుని B ఫర్ బ్యాట్ అని తదువుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Dinesh Karthik is back for India and the crowd chants ‘DK, DK’. pic.twitter.com/PlFHuBtCF9
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2022
పంత్ కూడా 2016లో ఇషాన్ కిషన్ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ ఆడగా.. ఆరేళ్ల తర్వాత ఇషాన్ కిషన్ పంత్ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పంత్ కెప్టెన్ గా తన తొలి టీ20 మ్యాచ్ లో పరాభవం చవిచూశాడు. విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ గా తమ తొలి టీ20 మ్యాచ్ లో ఓటమి చవిచూసిన టీమిండియా రెండో కెప్టెన్ గా పంత్ రికార్డులకెక్కాడు. పంత్ పై వస్తున్న సెటైర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Everyone loves Dinesh Karthik. pic.twitter.com/9QbyEQyKWj
— Johns. (@CricCrazyJohns) June 9, 2022