గత కొన్ని సిరీస్ ల నుంచి టీమిండియా ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. ఇటు బ్యాటింగ్ లో.. అటు బౌలింగ్ లో దారుణంగా విఫలం అవుతూ పరాజయాలు మూటగట్టుకుంటోంది. ఈ వైఫల్యం ఇప్పటి నుంచి కొనసాగుతోంది కాదు. ఆసియా కప్ నుంచి ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డే దాక. తాజాగా జట్టు సమష్టి వైఫల్యం కారణంగా పసికూన బంగ్లాపై దారుణంగా ఓటమి చవిచూసింది టీమిండియా. ఆదివారం ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లా జట్టు వికెట్ తేడాతో గెలిచింది. అయితే ఇక్కడ బంగ్లా గెలిచింది అనడం కంటే టీమిండియా దగ్గరుండి గెలిపించింది అనడం సబబు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి ముఖ్య కారణం స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. మెుదట బ్యాటింగ్ లో హీరో అయినప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం విలన్ గా మిగిలాడు రాహుల్. అందుకే అంటారు ‘క్యాచ్ విన్స్ మ్యాచ్’ అని.
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఢాకా వేదికగా ఆదివారం తొలి వన్డే జరిగింది. గత కొన్ని పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా.. బంగ్లా తో జరిగే సిరీస్ లో నైనా గెలిచి అభిమానులకు ఊరట కలిగించాలని అనుకుంది. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ లో వికెట్ తేడాతో ఓడిపోయి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇక మెుదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టెస్ట్ కంటే దారుణమైన బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. బంగ్లా బౌలర్లు షకీబ్ తో పాటుగా ఎబాదత్ హుస్సేన్ విజృంభించడంతో టీమిండియా 186 పరుగులకే కుప్పకూలింది. విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్(27), కోహ్లీ(9) త్వరగానే నిష్ర్కమించారు. జట్టులో మిగతా బ్యాటర్లలో ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే రాణించాడు. రాహుల్ బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్ని 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో రాహులే విలన్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా పరుగులు చేయడంలో తెగ ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో అతడిపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు మాజీలు, నెటిజన్లు. ఈ విమర్శలన్నింటికి జవాబు చెప్పాడు. కానీ మరో విమర్శలకు కేంద్రబిందువైయ్యాడు. బంగ్లాతో తొలి వన్డేలో 49 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. అప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు కేఎల్ రాహుల్. ఓ వైపు వికెట్లు పడుతున్నా గానీ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే 70 బంతుల్లో 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్ చేసిన పరుగుల పుణ్యమాని టీమిండియా186 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో మెుదట హీరో రాహులే. కానీ బంగ్లా ఇన్నింగ్స్ చివరి కల్లా అతడు విలన్ గా మారిపోయాడు.
దానికి కారణం బంగ్లా బ్యాటర్ మెహదీ హసన్ ఇచ్చిన బంగారం లాంటి క్యాచ్ ను చేజేతులా జారవిడచటమే. ఈ క్యాచ్ నేలపాలు కావడంతో టీమిండియా విజయం కూడా చేజారిపోయింది. అప్పటికీ హసన్ 15 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. బంగ్లా స్కోర్ 155/9 గా ఉంది. ఈ క్యాచ్ రాహుల్ ఒడిసిపట్టి ఉంటే టీమిండియా 31 రన్స్ తో గెలిచి ఉండేది. కానీ అలా జరగలేదు. క్యాచ్ డ్రాప్ కావడంతో రెచ్చిపోయిన హసన్.. ముస్తాఫిజుర్ రెహ్మాన్(10) తో కలిసి చివరి వికెట్ కు 50 పరుగులు జోడించడం విశేషం. 38 పరుగులు చేయడంతో పాట్ 1 వికెట్ తీసిన హసన్ బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక క్యాచ్ డ్రాప్ చేసిన రాహుల్ ను సోషల్ మీడియా వేదికగా క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Kl Rahul droped the catch #klrahul pic.twitter.com/BnBwjvik9c
— Adnan Ansari (@AdnanAn71861809) December 4, 2022
Was that the game for India?🤔
KL Rahul dropped Mehidy Hasan Miraz on 15*(22) & Bangladesh were 155/9.
📸: Sony LIV pic.twitter.com/dbiZ1iQCsV
— CricTracker (@Cricketracker) December 4, 2022