టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆదివారం ఎంతో అట్టహసంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలతో గెలవాలని కోరుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిందంటూ టీమిండియాపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మొదటగా బ్యాంటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ 3 పరుగుల వద్ద బౌల్డ్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇక్కడ షాహిన్ అఫ్రిదీ బౌలింగ్ లో రాహుల్ అవుటయ్యాడు. కానీ రాహుల్ అసలు అవుటే కాదని అఫ్రిదీ నౌ బాల్ వేశాడంటూ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్స్. ఇదే విషయాన్ని అంపైర్, థర్డ్ అంపైర్ సరిగ్గా గమనించని కారణంగా అవుట్ గా తేల్చారని మండిపడుతున్నారు. ఇక లైన్ దాటుతున్న బౌలర్ ఫోటోలు ట్విట్టర్ లో పెడుతూ నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే కేఎల్ రాహుల్ అవుట్ విషయంలో అంపైర్ తప్పిదమే కారణమని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.