టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆదివారం ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలతో గెలవాలని కోరుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మెంటర్ ధోనీ నిర్ణయాలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ సేన కోహ్లీ మినహా వవరూ కూడా పెద్దగా అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. ఇక ఓపెనర్లుగా బరిలో దిగిన రోహిత్, కేఎల్ రాహుల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. రోహిత్ మాత్రం పూర్తిగా డకౌట్ కావటంతో టీమిండియాకు మొదటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ తో పాటు పంత్ కూడా కోహ్లీకి కాస్త దన్నుగా నిలిచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో పంత్ అవుట్ అయ్యాడు.
ఇది కూడా ఇండియా ఓటమికి కాస్త మైనస్ గా మారిందనే చెప్పాలి. వీరి తర్వాత సూర్య కుమార్ యాదవ్, జడేజా, హర్థిక్ పాండ్యా ఇతర ఆటగాళ్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోవటంతో టీమిండియా తక్కువ స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఇక పాకిస్తాన్ బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో స్కోర్ రాణించటంలో అడ్డుగా నిలిచారు. ఇక బ్యాంటింగ్ కు దిగిన పాకిస్తాన్ తెలికగా విజయం దిశగా అడుగులు వేసింది.
మరీ ముఖ్యంగా శార్దూల్ స్థానంలో ఫామ్‌లో లేని భువనేశ్వర్‌ను తీసుకోవడం, అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగి నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 33 పరుగులు ఇవ్వటం పాకిస్తాన్ కు కలిసొచ్చి ఇండియాకు పెద్ద మైనస్ గా మారింది. దీంతో మొత్తానికి టీమిండియా ఓటమిపై అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మెంటర్ గా అడుగు పెట్టిన ధోనీ, కోహ్లీ నిర్ణయాలు ఏంటంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.