ఏంట్రా బాబు.. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నాడా..? లేక గల్లీ క్రికెట్ అనుకున్నాడా..? ఆ అరుపులేంటి? ఆ గోలేంటి? ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటా! అవును నేను చెప్పేది.. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ గురించే. ఇంతకీ మనోడు ఈ మ్యాచ్ లో ఎంత హంగామా చేశాడో తెలుసా? ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఆ మ్యాచ్ లో ఉండే మజా అలాంటిది మరి. గత టీ20 ప్రపంచక కప్ ఒక్క మ్యాచ్ లో తప్ప దాదాపు దాయాది దేశాల మధ్య జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ మనమే గెలుస్తూ వచ్చాం. ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లోనూ ఆ విజయ పరంపరనే కొనసాగించాం. కాకపోతే ఎంతో హుందాగా ఆడాల్సిన ఈ మ్యాచ్ లో పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ పిల్ల చేష్టలు నవ్వు తెప్పించాయి. ఒకానొక టైమ్ లో చిరాకు కూడా తెప్పించాయి.
ఆదివారం భారత్ తో మ్యాచ్ సందర్భంగా.. మన క్రికెటర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. బ్యాట్ కి తాకినా తాకకపోయినా వికెట్ల వెనక నుంచి పదే పదే అప్పీలు చేస్తూ కనిపించాడు. ఇలా ఒక్కసారి.. రెండు సార్లు కాదు మ్యాచ్ లో లెక్క లేనన్ని సార్లు ఇతడు అంపైర్ కు అప్పీల్ చేస్తూనే ఉన్నాడు. ఇక మ్యాచ్ ను చూసిన అభిమానులు పిల్ల చేష్టలు మానుకో రిజ్వాన్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న ప్రారంభ ఓవర్లలో అయితే మరీ గట్టిగా అరుస్తూ పిల్లాడిలా ప్రవర్తించాడు. ఈ విషయమై నెటిజన్స్ కూడా ఫుల్ ఫైర్ అయిపోయారు. గల్లీ క్రికెటర్ లా చిరాకు తెప్పించే ఆ ప్రవర్తన ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. అదీ కాక ఇది గల్లీ క్రికెట్ కాదు భాయ్ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. హార్దిక్ పాండ్య ఆల్ రౌండర్ మెరుపుల వల్ల ఈ ఆసియా కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన పాకిస్థాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్ అత్యధికంగా 43 పరుగులు చేయగా.. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, హార్దిక్ పాండ్య 3, అర్షదీప్ 2, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో కాస్త తడబడినట్లు కనిపించిన భారత్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. కోహ్లీ 35, జడేజా 35, హార్దిక్ 33 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈ మ్యాచ్ లో రిజ్వాన్ చేసిన ఓవర్ యాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rizwan on every ball going towards him.. #AsiaCup2022 #IndiaVsPakistan pic.twitter.com/tLlpvkuNRT
— Bhushan More (@b2more) August 28, 2022
Entertainer of the whole match was Rizwan #INDvsPAK #AsiaCup2022 pic.twitter.com/wYMZmjZ8j5
— Ri (@TweetByRi) August 29, 2022
ఇదీ చదవండి: వీడియో: పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం! సంబురాలు చేసుకున్న అఫ్ఘానిస్థాన్ ఫ్యాన్స్