టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆదివారం ఎంతో అట్టహసంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా క్రికెటర్ ల పై కొంతమంది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా భారత స్విమ్ బౌలర్ మహ్మద్ షమీపై తిట్ల పురాణాన్ని అందుకున్నారు.
అయితే మ్యాచ్ లో భాగంగా మహ్మద్ షమీ వేసిన బౌలింగ్ లో భారీ స్కోర్ రావటంతో టీమిండియా ఓటమికి ఓ కారణంగా భావించారు. దీంతో కొంత మంది నెటిజన్స్ మాత్రం షమీపై శృతిమించి కామెంట్ చేశారు. మహ్మద్ షమీ పాకిస్తాన్ కు అమ్ముడుపోయాడని ఇక రిటైర్ మెంట్ తీసుకో అంటూ అసభ్యకరంగా బూతులు తిట్టారు.
దీంతో వెంటనే స్పందించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మ్యాచ్ తర్వాత మహ్మద్ షమీని టార్గెట్ చేస్తున్నారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే షమీపైనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అసదుద్దీన్ ప్రశ్నించారు. దేశంలో ద్వేషం ఎంత పెరిగిపోతుందో స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి విద్వేశాలు ఎవరు సృష్టిస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసం అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.