నేపాల్ క్రికెట్ టీమ్ తొలిసారి ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. యూఏఈ తో జరిగిన నిన్న మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరానంటాయి.
నేపాల్ జట్టు క్రికెట్ అంటే ఎంత మక్కువ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే అందరూ వర్షం వచ్చిన గొడుగు వేసుకొని మ్యాచ్ చూస్తూ కనిపించారు. ఇక కొంతమందైతే చెట్టు మీద కూర్చొని మరీ మ్యాచ్ చూడడం హైలెట్ గా మారింది. ప్రస్తుతం ఆసియా కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేపాల్ క్రికెట్ టీమ్ తొలిసారి ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. యూఏఈ తో జరిగిన నిన్న మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరానంటాయి.
ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనుంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ ఈ టోర్నీ కి నేరుగా అర్హత సాధించగా.. 6 టీమ్ కోసం నిర్వహించిన క్వాలిఫయింగ్ మ్యాచుల్లో నేపాల్ టాప్ ప్లేస్ లో నిలిచి ఈ టోర్నీలో ఆడబోతుంది. డిఫెండింగ్ చాంపియన్ గా శ్రీలంక బరిలోకి దిగుతుంది. ఇక భారత్ ఈ మ్యాచులో పాకిస్థాన్ లో ఆడడం లేదని కన్ఫర్మ్ చేసింది. దీంతో భారత్ ఆడబోయే మ్యాచుల కోసం తటస్థ వేదికలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి తొలి సారి ఆసియా కప్ కి అర్హత సాధించిన నేపాల్ జట్టుకి హాట్స్ ఆఫ్. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Congratulations Nepal!
Nepal beat UAE by seven wickets in the ACC Premier Cup final to qualify for this year’s Asia Cup.
We are proud of the effort from our boys, we will be back and STRONG! 💪🇦🇪
Scorecard and details: https://t.co/elXH5F89OZ pic.twitter.com/eYyzMsN4qF— UAE Cricket Official (@EmiratesCricket) May 2, 2023