బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అతడు బద్దలుకొట్టాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. ఆ జట్టు స్పిన్నర్లు విజృంభించారు. ఆరంభంలో పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న ఇండోర్ పిచ్‌పై కంగారూ స్పిన్నర్లు చెలరేగారు. దీంతో టాస్ గెలిచి తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ పూర్తిగా తడబడింది. మ్యాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లతో రాణించాడు. సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్ 3 వికెట్లు తీసి అతడికి చక్కటి సహకారాన్ని అందించాడు. వీళ్ల దెబ్బకు భారత టీమ్ 12 ఓవర్లలో 46 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కుహ్నెమన్ అవుట్ చేసి ఆసీస్‌కు శుభారంభాన్ని అందించాడు. లయన్ కూడా తన అనుభవాన్ని రంగరించి బాగా బౌలింగ్ చేశాడు.
ఈ క్రమంలో ఛటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాను ఔట్ చేసి అరుదైన ఘనత సాధించాడు నాథన్ లయన్. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడీ వెటరన్ స్పిన్నర్. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాను గెలిపించిన జడేజా వికెట్‌ను తీయడం ద్వారా లయన్ చరిత్ర సృష్టించాడు. ఆసియాలో లయన్‌కు ఇది 128వ వికెట్ కావడం విశేషం. తద్వారా ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరు మీద ఉన్న రికార్డును లయన్ బద్దలు కొట్టాడు. ఇకపోతే, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 109 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (22) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దీన్ని బట్టే మన బ్యాటర్లు ఎంతగా ఫెయిలయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు కూడా తడబడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
Just In: Nathan Lyon has surpassed Shane Warne in this list 🔝#INDvAUS #NathanLyon #ShaneWarne #AustralianCricket #AustralianCricketTeam #TestCricket pic.twitter.com/2swpYUYLZ4
— OneCricket (@OneCricketApp) March 1, 2023