క్రికెట్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు. సచిన్, ధోనీ, కోహ్లీ.. ఇలా చాలామంది పేర్లు చెబుతారు. ఇక్కడ వీళ్ల పేర్లు మాత్రమే ఎందుకు చెబుతున్నానంటే.. ఓ బౌలర్ వికెట్ తీయడం కంటే, మనకు బ్యాటర్ సిక్స్ కొడితేనే ఎక్కువ ఆనందపడిపోతాం. ఈ కారణం వల్ల బౌలర్స్ కంటే బాటర్లే ఎక్కువ ఫేమస్. తాజాగా జరిగిన ఆసియాకప్ లోనూ బ్యాట్స మన్ కంటే ఒకరిద్దరూ బౌలర్స్ ఫేమస్ అయ్యారు. పాక్ జట్టులో ఓ కుర్ర బౌలర్ అదరగొట్టేశాడు. జట్టు కప్ కొట్టకపోయినా సరే తాను మాత్రం వావ్ అనిపించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దుబాయి వేదికగా ఆదివారం, శ్రీలంక-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు 170 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పాక్, 147 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్వీయ తప్పిదాల కారణంగా మ్యాచ్ చేజేతులా కోల్పోయింది. పాక్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టులోని యువ బౌలర్ నసీమ్ షా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీలంకతో ఫైనల్లోనూ అదిరిపోయే బంతులేసి వావ్ అనిపించాడు.
ఈ మ్యాచులో లంక ఇన్నింగ్స్ ప్రారంభించింది. నసీమ్ షా.. తొలి ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ టోర్నీ ఆసాంతం ఫుల్ ఫామ్ లో ఉన్న కుశాల్ మెండిస్ ని అద్భుతమైన ఇన్ స్వింగర్ తో ఔట్ చేశాడు. ఈ ఫాస్ట్ బంతిని చూసిన పలువురు నెటిజన్స్.. కోహ్లీ, రోహిత్, డివిలియర్స్ కూడా ఈ బంతిని ఎదుర్కోలేరేమో అని అంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. మనోడికి ఆసియాకప్ తొలి అంతర్జాతీయ టోర్నీ. అయినా సరే ఏ మాత్రం బెరుకులేకుండా ఆకట్టుకునే గణాంకాలు నమోదు చేశాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో చూడాలి. నసీమ్ బౌలింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ అంటేనే ఇష్టం! బాబర్ అజామ్ గాలి తీసేసిన పాకిస్థాన్ కోచ్!
Naseem Shah at his best – stumps all over the place #PAKvSL #AsiaCup2022Final pic.twitter.com/eGgjPDcj1E
— Saj Sadiq (@SajSadiqCricket) September 11, 2022