క్రికెట్ లో ఒక బ్యాట్స్ మెన్ వరుసగా మూడు సెంచరీలు చేస్తేనే వారెవ్వా అంటాం. ఇక నాలుగు శతకాలు బాదితే వీడెవడ్రా బాబు ఇంతలా ఆడుతున్నాడు అంటాం. మరి వరుసగా 5 సెంచరీలు బాదితే.. మన దగ్గర అతడిని పొగడడానికి బహుశా పదాలు కూడా ఉండక పోవచ్చు. అంతలా రెచ్చిపోయి ఆడుతున్నాడు తమిళనాడు స్టార్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్. ధోనిపై కోపమో తెలీదు.. CSK వదిలించుకున్న బాధో తెలీదు. శతకాల మీద శతకాలు బాదుతూ.. 14 ఏళ్ల కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు ఈ నయా సంచలనం. ప్రస్తుతం జరుగుతున్న దేశవాలీ లీగ్ విజయ్ హజరే ట్రోఫీలో దుమ్ములేపున్నాడు ఈ యువ కెరటం. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సైతం సెంచరీ బాదాడు. దాంతో కోహ్లీ రికార్డు బద్దలు అయ్యింది. విజయ్ హజరే ట్రోఫీలో వరుసగా 5 శతకాలు బాది నయా రికార్డు సృష్టించాడు ఈ తమిళ తంబి.
నారాయణ్ జగదీశన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. 14 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు జగదీశన్. ఇప్పటికే విజయ్ హజరే ట్రోర్నీలో వరుసగా 4 సెంచరీలు బాది సూపర్ ఫామ్ లో ఉన్న జగదీశన్.. మరో శతకం బాది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో జగదీశన్ 102 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సులు లతో 159 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన జగదీశన్ కు సరైన అవకాశాలు రాలేదు. కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఆడిన జగదీశన్ 73 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ధోనితో సహా చెన్నై యాజమాన్యం అతడిని వదులుకుంది.
Most hundreds in a single season in Vijay Hazare Trophy:
Narayan Jagadeesan – 5*
Virat Kohli – 4
Prithvi Shaw – 4
Ruturaj Gaikwad – 4
Devdutt Padikkal – 4— Johns. (@CricCrazyJohns) November 21, 2022
ఎప్పుడైతే చెన్నై వదులుకుందో అప్పటి నుంచే జగదీశన్ బ్యాటింగ్ లో శివతాండవం చేస్తున్నాడు. వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదుతు చెన్నైను ఇరకాటంలోకి నెట్టేశాడు. ఈ క్రమంలోనే 14 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును తాజా సెంచరీతో బద్దలు కొట్టాడు. విజయ్ హజరే ట్రోఫీ 2008-09 సీజన్ లో విరాట్ వరుసగా 4 సెంచరీలతో 534 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పుడు జగదీశన్ వరుసగా 5 శతకాలు బాది కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే ఈ కుర్ర సంచలనం శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర సరసన చేరాడు. ఇక ప్రస్తుతం ఇతడి ఫామ్ చూస్తుంటే.. త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరను దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు క్రీడా నిపుణులు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ అనవసరంగా నారాయణ్ జగదీశన్ ను వదులుకుంది అంటున్నారు సగటు క్రీడాభిమానులు. అయితే ఐపీఎల్ లో ఒకవేల చెన్నై గనక అతడిని కొనుగోలు చేయకపోతే.. అతడే ప్రత్యర్థిగా మారి చెన్నైను ఓడించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు నెటిజన్లు.
Take a bow, Narayan Jagadeesan – 4 consecutive hundreds 🙏#NarayanJagadeesan #VijayHazareTrophy #BCCI pic.twitter.com/Ne6MjibyHQ
— Oh My Cricket (@OhMyCric) November 19, 2022
Narayan Jagadeesan is in red hot form 👊 #VijayHazare pic.twitter.com/2LuvqopBFC
— CricketTimes.com (@CricketTimesHQ) November 19, 2022