సమాచార హక్కు చట్టం నుంచి నాడా నుంచి సేకరించిన లెక్కలు వచ్చేసాయి. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా డోపింగ్ టెస్టుకు హాజరు కాలేదని తెలుస్తుంది.
“నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ” 2019 నుంచి క్రికెటర్లకు డోపింగ్ టెస్టు పరిధిలోకి తీసుకొని వచ్చింది. క్రికెటర్లు ఎవరైనా నిషేధిక ఉత్ప్రేరకాలు వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ టెస్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గాయం నుంచి కోలుకోవడానికి మందులు వాడిన తర్వాత డోప్ టెస్టుకి శాంపిల్స్ ఇవ్వడం తప్పనిసరి. దీంతో కొంతమంది క్రికెటర్లు ఎక్కువగా డోప్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా ఈ డోప్ టెస్టు పాల్గొనాల్సి వచ్చింది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం గత రెండేళ్లుగా డోపింగ్ టెస్టుకు హాజరు కాలేదని తెలుస్తుంది. అంతే కాదు కోహ్లీతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న 25 మంది క్రికెటర్లలో 12 మంది ఇప్పటిదాకా నాడాకి డోప్ శాంపిల్స్ ఇవ్వలేదు.
సమాచార హక్కు చట్టం నుంచి నాడా నుంచి సేకరించిన లెక్కలు వచ్చేసాయి. దీని ప్రకారం 2021 -2022 మధ్య రెండేళ్లలో 5,961 మంది భారత క్రీడాకారులకి డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 114 మంది భారత క్రికెటర్లు కాగా.. మిగిలిన క్రీడలతో పోలిస్తే 1717 మంది అథ్లెటిక్స్ ఈ డోప్ పరీక్షల్లో పాల్గొన్నారు. గడిచిన రెండేళ్లలో అత్యధిక సార్లు డోపింగ్ టెస్టు చేయించుకున్న క్రికెటర్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ. రెండేళ్లలో రోహిత్ శర్మ, ఆరు సార్లు డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నాడు. తరచూ గాయాలు కావడమే దీనికి కారణమని తెలుస్తుంది. గాయాలతో కొన్ని మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ.. కరోనా బారిన పడడంతో ఎక్కువ సార్లు ఈ టెస్టులో పాల్గినాల్సి వచ్చింది.
అయితే ఈ లిస్టులో ఇప్పటివరకు కోహ్లీతో పాటు హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్, శ్రీకర్ భరత్, వాషింగ్టన్ సుందర్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇక గత రెండేళ్లలో గాయపడిన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా లాంటి ఆటగాళ్లు కేవలం ఒకేసారి మాత్రమే డోప్ టెస్టు చేయించుకున్నారు. గతంలో పృథ్వీ షా, రింకూ సింగ్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అవ్వడంతో వీరిద్దరిపై కొన్నాళ్లు బ్యాన్ అనుభవించారు.ఇక ఉమెన్స్ క్రికెటర్ల విషయానికి వస్తే భారత మహిళా జట్టులోని ప్లేయర్లు అందరూ నాడాకి డోప్ శాంపిల్స్ అందించారు. వీరిలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఎక్కువ సార్లు శాంపిల్ ఇచ్చినట్టుగా తెలిసింది. మొత్తానికి ఫిట్ నెస్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ కోహ్లీ వీటికి దూరంగా ఉండడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.