వీరేంద్ర సెహ్వాగ్.. వరల్డ్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకున్నాడు. బౌలర్ ఎవరన్నది సెహ్వాగ్ కు అనవసరం.. బౌండరీ బాదామా లేదా అన్నదే వీరేంద్రుడి తత్వం. మరి అలాంటి డ్యాషింగ్ బ్యాటర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్. సెహ్వాగ్ లా తనకూ యాజమాన్యం మద్ధతు లభించి ఉంటే.. నా కెరీర్ కూడా వేరేలా ఉండేదని వాపోయాడు. మేనేజ్ మెంట్ వీరూ భాయ్ కు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు ఇవ్వలేదని, సెహ్వాగ్ కు క్రీడా జీవితంలో అనుకున్నవి అన్నీ దక్కాయని ఈ టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇతడి కామెంట్స్ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
క్రికెట్ లో రాణించాలి అంటే.. ఎన్నో కష్ట నష్టాలను దాటుకుని రావాలి. అవన్నీ దాటుకుని వచ్చినా గానీ ఆ ఆటగాడికి జట్టులో స్థానం లభిస్తుందని గ్యారంటీగా చెప్పలేం. ఒకవేళ జట్టులో చోటు సంపాదించినా గానీ, అతడు రాణించకపోతే జట్టులో చోటు కోల్పోతాడు. అలానే టీమిండియా నుంచి స్థానం కోల్పోయాడు టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్. తాజాగా స్పోర్ట్స్ స్టార్ షోలో పాల్గొన్న విజయ్ పలు ఆసక్తికర, షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా మురళీ విజయ్ మాట్లాడుతూ..”టీమిండియాలో వీరేంద్ర సెహ్వాగ్ కు దక్కినంత ఫ్రీడం నాకు దక్కలేదు. వీరు భాయ్ కు మేనేజ్ మెంట్ నుంచి పూర్తిగా మద్ధతు లభించేది. అతడు చెప్పిన మాటలు యాజమాన్యం వినేది. పైగా వీరు మాట అన్ని విధాల చెల్లేది. ఈ తరహా స్వేచ్ఛ నాకు మాత్రం లభించలేదనే చెప్పాలి. నాకూ సెహ్వాగ్ లా ఫ్రీడం లభించి ఉంటే.. ప్రస్తుతం నా కెరీర్ వేరేలా ఉండేది” అంటూ వ్యాఖ్యానించాడు విజయ్.
Murali Vijay: ‘जो आजादी सहवाग को मिली, मुझे वैसा समर्थन करने वाले कोई नहीं था’, मुरली विजय का बड़ा बयान#MuraliVijay #VirenderSehwag #Indiahttps://t.co/qI1UVUPfbO
— Amar Ujala (@AmarUjalaNews) January 17, 2023
అయితే మేనేజ్ మెంట్ లో నా మాట వినిపించుకునే వారే కరువైయ్యారని విజయ్ వాపోయాడు. ఇక క్రికెట్ లో రాణించాలి అంటే మేనేజ్ మెంట్ మద్ధతు కీలకం, అదీకాక వరుస అవకాశాలు వస్తేనే ప్రయోగాలు చేసేందుకు వీలుంటుంది అని ఈ సందర్భంగా మురళీ విజయ్ చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా వీరూ భాయ్ ఎనలేని సేవలు చేశారు. బహుశా అతడిలా ఎవరూ ఆడలేరు. ఎంతటి ఫాస్ట్ బౌలర్లనైనా చీల్చి చెండడగల డ్యాషింగ్ బ్యాటర్ వీరు.. అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం మురళీ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైయ్యాయి. మరి మురళీ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“When Sehwag was there, I felt controlling my instincts and playing was hard but to see him go through that kind of freedom was something spectacular”- Murali Vijayhttps://t.co/sY3wJAYbn3
— Express Sports (@IExpressSports) January 17, 2023