భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ మురళీ విజయం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. 2018 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మురళీ విజయ్ కొద్దిరోజుల క్రితమే బీసీసీపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు. బీసీసీఐతో అనుబంధం ముగిసిందంటూ.. విదేశీ లీగుల్లో ఆడటం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ప్రకటన చేశాడు. ఇది జరిగిన వారం రోజులకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
“బీసీసీఐతో నా అనుబంధం దాదాపు ముగిసింది. కానీ, నాకు ఇంకా క్రికెట్ ఆడాలని ఉంది. అందువల్ల విదేశీ లీగుల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. భారతదేశంలో 30 ఏళ్లు వచ్చిన వెంటనే మనం అంటరానివారమవుతాం. ఏదో 80 ఏళ్లు వచ్చినట్లుగా పరిగణిస్తారనుకుంటాను. మీడియా కూడా 30 ఏళ్లు దాటితే మమ్మల్ని వయసుమళ్లిన వారిగా చిత్రీకరిస్తుంది. క్రికెట్ పరంగా నా విషయంలో.. నేను ఇప్పటికీ నా బెస్ట్ ఇవ్వగలనని అనుకుంటున్నాను. కానీ, దురదృష్టవశాత్తు నాకు చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను బయట అవకాశాలను వెతుక్కోవాలి..” అంటూ మురళీ విజయ్ కొద్దిరోజుల క్రితం తన బాధను వెళ్లగక్కాడు.
144 at Brisbane.
145 at Trent Bridge.
95 at Lord’s.
99 at Adelaide.
97 at Kingsmead.One of the best openers in overseas for India in Tests – Thank you, Murali Vijay. pic.twitter.com/EWbtlXq7ID
— Johns. (@CricCrazyJohns) January 30, 2023
ఇది జరిగిన పది రోజులకే విజయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన మురళీ విజయ్ ఆటగాడిగా, ఓపెనర్ గా ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ లు ఆడాడు. కానీ, అతడికి సరైన గుర్తింపు దక్కలేదన్నది వాస్తవం. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టెస్టు ఓపెనర్‌గా మారిన విజయ్ కి రాను.. రాను.. జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. వరుసగా వైఫల్యాలు.. రోహిత్ శర్మ టెస్టుల్లోకి తిరిగి ఇవ్వడంతో విజయ్ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడింది. 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. టీమిండియా తరుపున 61 టెస్టులు ఆడిన విజయ్.. 12 సెంచరీలు, 15 హఫ్ సెంచరీలతో 3982 పరుగులు చేశాడు. ఇక 17 వన్డేలలో 21.18 సగటుతో 339 పరుగులు చేశాడు. అలాగే, 9 టీ20 మ్యాచుల్లో 169 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. 106 మ్యాచుల్లో 2619 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023