ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని సాధించింది. ఎనిమిది వరుస ఓటముల తర్వాత.. ముంబై వచ్చిన గెలుపు ఇది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ షోను ప్రదర్శించింది. ఈ సీజన్‌తో రెండు కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వడంతో కొన్ని జట్లు తమ స్టార్ ప్లేయర్లను కోల్పోయాయి. కానీ.. ముంబై ఇండియన్స్ మాత్రం తమ కోర్ టీమ్‌ను అంటిపెట్టుకుంది. దీంతో మరోసారి ముంబై జైత్రయాత్ర కొనసాగిస్తుందని అంతా భావించారు. కానీ.. సీజన్ ఆరంభం అయిన తర్వాత గానీ అసలు విషయం బోధపడలేదు.
కోర్ టీమ్(రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, పొలార్డ్)కు తోడు జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా.. ఐపీఎల్ మెగా వేలంలో కొన్ని తప్పిదాలు చేసింది. ముఖ్యంగా ఒక నాణ్యమైన స్పిన్నర్‌ను తీసుకోకుండా ఘోరతప్పిదం చేసింది. ఈ తప్పు ఎంత ప్రభావం చూపగలదో.. టోర్నీ ఆరంభం అయిన కొన్ని మ్యాచ్‌లలోనే ముంబైకి తెలిసొచ్చింది. ఎనిమిది వరుస ఓటముల తర్వాత ముంబైకి వచ్చిన గెలుపులో ఎక్కువ క్రెడిట్ కొత్త కుర్రాడు స్పిన్నర్ కుమార్ కార్తీకేయకు ఇవ్వాల్సిందే. ఇన్ని రోజులు కేవలం పేస్‌ను నమ్ముకుని ముంబై నిండా మునిగింది. కానీ.. శనివారం మ్యాచ్‌లో కేకే సింగ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇన్ని రోజులు ముంబై బౌలింగ్ ఎటాక్‌లో ఇలాంటి కట్టుదిట్టమైన స్పెల్ మిస్ అయింది.
బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ మొదటి నుంచి రాణిస్తున్నా.. ముంబై గెలవలేదు. కానీ.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండి, ఈ సీజన్‌లో అదరగొడుతున్న రాజస్థాన్ లాంటి టీమ్‌ను కేవలం 158 పరుగులకు కట్టడి చేయడం అంత ఆశామాషీ విషయం కాదు. పైగా ఈ సీజన్‌లో ఏకంగా మూడు సెంచరీలు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న బట్లర్ 52 బంతులు ఆడినా కూడా జట్టు స్కోర్ నామమాత్రంగా ఉందంటే అందుకు కారణం కార్తికేయ. ఇలా జట్టుకు అవసరమైన అన్ని విభాగాలను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ వేలంలో బ్యాలెన్స్ చేయలేకపోయింది. అందుకే ఈ సీజన్‌లో ముంబై దారుణమైన ప్రదర్శన కనబరుస్తుంది. సగం సీజన్ ముగిసిన తర్వాత వచ్చిన గెలుపుతోనైనా ముంబై తమ తప్పును తెలుసుకుని.. వచ్చే సీజన్‌లో అయినా తమ లోపాలను సమరించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Kumar Kartikeya: ఆశయం కోసం 9 ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్న ముంబై ఇండియన్స్ ప్లేయర్
जिंकलो रे!!! 💙#OneFamily #दिलखोलके #MumbaiIndians #RRvMI #TATAIPL @surya_14kumar @timdavid8 @TilakV9 pic.twitter.com/yMqAFZCvOX
— Mumbai Indians (@mipaltan) April 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.