దేశంలో ఐపీఎల్ 16వ సీజన్ సందడి అప్పుడే మొదలైంది. రాబోవు సీజన్ లో ఎవరెవరిని బరిలోకి దించాలన్నా దానిపై ప్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో.. ఎవరెవరిని వదులుకున్నారో ఆ ఆటగాళ్ల లిస్టును బయటపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు ఇంతమందిని తొలగించడం ఇదే మొదటిసారి.
ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే.. ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు 15 సీజన్లు జరగగా, ఐదు సార్లు ఛాంపియన్ గా అవతరించింది. అంతటి సక్సెస్ రేట్ ఉన్న జట్టు అనూహ్యంగా గతేడాది జరిగిన 15వ సీజన్ లో బోల్తా పడింది. 14 మ్యాచుల్లో 4 విజయాలు, 10 అపజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. గెలుపు కోసం పోరాడటం కాదు కదా! కనీసం గెలవాలన్న కసి కూడా ఆటగాళ్లలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ముంబై యాజమాన్యం చర్యలు చేపట్టింది. రిటెన్షన్ లో భాగంగా ఏకంగా 13 మంది వదులుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వదులుకున్న ఆటగాళ్ల ఫొటోల్ని తమ ట్విట్టర్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది.
ముంబై జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో.. కీరన్ పోలార్డ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, సంజయ్ యాదవ్, రిలే మెరిడిత్, టైమల్ మిల్స్, డానియెల్ సామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు. అంటే.. వేలంలో ముంబై ఫ్రాంఛైజీ 13మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. వీళ్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు.
Once a part of #OneFamily, always a part of #OneFamily 💙#MumbaiIndians pic.twitter.com/4eTXunUyof
— Mumbai Indians (@mipaltan) November 15, 2022
ఇక అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా చూస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రమణ్ దీప్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, బూమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కార్తికేయలను రిటైన్ చేసుకుంది. కాగా, ఇప్పటికే ట్రేడింగ్ విధానంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నుంచి జోహాన్ బెహెండార్ఫ్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులు చూస్తుంటే రాబోవు సీజన్ లో ముంబై అద్భుతమైన ప్రదర్శన చేయడం ఖాయం.
Locked & loaded for #IPL2023 🔒💪
Presenting our stars for the upcoming season ⭐💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/lyg8IOFwpT
— Mumbai Indians (@mipaltan) November 15, 2022