బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని విధంగా ఆటగాళ్ల తలరాతలు మారుతున్నాయి. ఫ్రాంచైజ్‌లు ఎక్కువగా టీమిండియా యువ ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తున్నాయి. దాంతో పాటు కచ్చితంగా అవసరమైన విదేశి ఆటగాళ్లపై కూడా వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ ఊహించని విధంగా రికార్డు ధరకు అమ్ముడైయ్యాడు.
గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన ఈ సింగపూర్ ఆల్‌రౌండర్ అంతగా ప్రభావం చూపలేదు. అయినా కూడా అతనిపై ముంబై ఇండియన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఏకంగా రూ.8.25 కోట్లకు అతన్ని దక్కించుకుంది. టిమ్ కోసం కేకేఆర్ కూడా పోటీ పడింది. కానీ చివరికి ముంబై అతన్ని దక్కించుకుంది. కాగా టిమ్ డేవిడ్ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. మరి టిమ్‌కు అంత భారీ ధర దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.