ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా టీమిండియా యువ క్రికెటర్లపై భారీగా కాసులు కురిపించిన ఫ్రాంచైజ్‌లు కచ్చితంగా కావాలి అనే విదేశి ఆటగాళ్లపై కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి.
ఆర్చర్ కోసం వేలం ప్రారంభం అయిన వెంటనే రెండు ఫ్రాంచైజ్‌లు తమ చేతుల్లో ఉన్న బోర్డును అలానే ఎత్తి పట్టుకున్నాయి. చివరి రాజస్థాన్ వెనక్కు తగ్గటంతో.. ముంబై ఆర్చర్‌ను రూ.8 కోట్లకు దక్కించుకుంది. మరి ఆర్చర్‌కు భారీ ధర ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.