బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ రూ.12.25 కోట్లకు దక్కించుకోగా.. అయ్యర్ రికార్డు ధరను ఇషాన్ కిషాన్ బద్దలుకొట్టాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా ఇషాన్ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యధిక ధర కాగా.. ఈ మెగా వేలంలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.
గత సీజన్‌లో కూడా ముంబైకే ఆడిన ఇషాన్ మళ్లీ ముంబైతోనే ఉండనున్నాడు. రిటెన్షన్‌లో ఇషాన్‌ను తమతో ఉంచుకోని ముంబై.. వేలంలో మాత్రం భారీ ధర ఇచ్చి సొంతం చేసుకుంది. కాగా ఇషాన్ కిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడింది. దాదాపు రూ.15 కోట్ల వరకు ఇషాన్ కోసం ప్రయత్నించింది SRH. మరీ ఇషాన్‌కు దక్కిన ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.