బెంగుళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఒక దుర్భేద్యమైన జట్టును ఏర్పాటు చేసింది. ఈ జట్టులో ఒక స్పెషల్ ఆటగాడు వచ్చి చేరాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకున్న.. అతన్ని ఏకంగా రూ.3 కోట్లు పెట్టి దక్కించుకుంది. అతనే బేబీ ఏబీ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ డివిలియర్స్ లాగా బ్యాటింగ్ చేసే జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిస్. సౌత్ ఆఫ్రికా అండర్19 ప్లేయర్ అయిన బ్రెవిస్ బ్యాటింగ్ శైలి అచ్చం డివిలియర్స్‌లానే ఉంటుంది. అందుకే అతన్ని బేబీ ఏబీ అని పిలుస్తారు.
ఇటివల జరిగిన అండర్19 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన బ్రెవిస్.. 6 మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్ వేలంలో అతనికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ముంబై ఇండియన్స్ అతన్ని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో జూనియర్ ఏబీ డివిలియర్స్ ఇప్పుడు ముంబై జట్టులో ఉన్నాడు. చాలా కాలంగా ఆర్సీబీ జట్టుకు ఆడిన ఏబీ డివిలియర్స్.. 2021 సీజన్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో ఇప్పుడు ఈ బేబీ ఏబీనే మన ఏబీ డివిలియర్స్. మరి బేబీ ఏబీని ముంబై దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: 10 జట్లు అందులోని ఆటగాళ్ల పూర్తి వివరాలు