బుమ్రా గాయంతో ఈ ఐపీఎల్ కు దూరం కావడంతో.. ముంబై జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అయితే బుమ్రా స్థానాన్ని రిప్లేస్ సత్తా ఉన్న బౌలర్ కోసం వెతుకులాట ప్రారంభించింది ముంబై టీమ్. ఈ క్రమంలోనే ఓ టీమిండియా స్టార్ బౌలర్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం. మరి ఆ స్టార్ బౌలర్ ఎవరో ఇప్పడు తెలుసుకుందాం.
గత కొంత కాలంగా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా వెన్నముక గాయం తీవ్రం కావడంతో ఐపీఎల్ సీజన్ 2023 మెుత్తానికి బుమ్రా దూరం అయ్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ కు సీజన్ ప్రారంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టులో కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా అందుబాటులో లేకపోవడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా. అని ప్రపంచం మెుత్తం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓ అన్ సోల్డ్ ప్లేయర్ పేరు బుమ్రా స్థానానికి సరైనోడుగా ముంబై యాజమాన్యం భావిస్తోందని, ఇప్పటికే అతడిని అప్రోచ్ అయ్యినట్లు సమాచారం. మరి బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ సాధించిన జట్టుగా తిరుగులేని రికార్డును తన పేరున లిఖించుకుంది. ఇప్పటికే ఐదు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ముంబై.. ఆరో టైటిల్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. వెన్నముక గాయం నుంచి కోలుకోని బుమ్రా.. 2023 ఐపీఎల్ సీజన్ కు పూర్తిగా దూరం అయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే స్టార్ బౌలర్ కోసం ముంబై యాజమాన్యం చూస్తోంది. ఈ క్రమంలోనే బుమ్రా స్థానాన్ని రీప్లేస్ చేసే సత్తా సందీప్ శర్మకే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో స్టార్ బౌలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ శర్మ. దాంతో సందీప్ శర్మను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది ముంబై ఫ్రాంఛైజీ. ఇప్పటికే సందీప్ శర్మను కలిసి మాట్లాడినట్లు సమాచారం.
హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన సందీప్ శర్మ.. తన పదునైన స్వింగ్ తో బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టగలడు. పవర్ ప్లేలో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లతో కట్టుదిట్టంగా బంతులు వేయడంలో సందీప్ శర్మ సిద్దహస్తుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఐపీఎల్ లో అతడి గణాంకాలు చూస్తేనే అతడి బౌలింగ్ పదును తెలుస్తుంది. 104 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన సందీప్ శర్మ.. 7.77 ఎకానమీతో 114 వికెట్లు తీశాడు. తాజాగా విజయ్ హాజరే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు సందీప్ శర్మ. 7 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. దాంతో అతడి ముంబై సంప్రదించినట్లు తెలుస్తోంది.
దాంతో బుమ్రా ప్లేస్ కు సరితూగే బౌలర్ సందీప్ శర్మనే అని ముంబై యాజమాన్యం భావిస్తోందని సమాచారం. అయితే టాలెంటెడ్ బౌలర్ అయినప్పటికీ ఈ సీజన్ లో అన్ సోల్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మ మిగిలిపోవడం విశేషం. ఇక సందీప్ శర్మ తో పాటుగా మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో ధావల్ కులకర్ణి, వరుణ్ ఆరోన్ అన్ క్యాప్డ్ ప్లేయర్ అయిన అర్జన్ నాగ్వాస్వాలా పేరు కూడా వినిపిస్తోంది. మరి బుమ్రా స్థానం కోసం అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయిన సందీప్ శర్మను ముంబై జట్టులోకి తీసుకుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.