క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో క్రికెట్‌ను చూడటమే కాదు.. దేశానికి ప్రాతినిథ్యం వహించాలని క్రికెట్టే ప్రాణంగా బతికే యువ క్రికెటర్ల సంఖ్య కూడా భారీగా ఉంది. జాతీయ జట్టుకు ఆడాలనే వారు కోట్లలో ఉంటారు. కానీ.. అందరి కల తీరడం అంత సులువుకాదు. టీమిండియాలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో జాతీయ జట్టులో చోటు కోసం ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. వారిలో ముంబైకి చెందిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒకడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌కు జాతీయ జట్టులో స్థానం దక్కుతుందని చాలా కాలంగా క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. కానీ.. చాలా సార్లు సర్ఫరాజ్‌కు నిరాశే ఎదురవుతూ వస్తోంది.
తాజాగా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మాత్రం సర్ఫరాజ్‌ను కచ్చితంగా టీమ్‌లోకి తీసుకుంటారని అంతా భావించినా.. అలా జరగలేదు. టీ20 స్పెషలిస్ట్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు టీమ్‌లోకి తీసుకున్నారు కానీ.. సర్ఫరాజ్ ఖాన్‌ను మాత్రం తీసుకోలేదు. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాను మనిషినేనని, టీమిండియా స్థానం దక్కకపోవడంపై చాలా బాధకలిగిందని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. దీంతో అతకి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సర్ఫరాజ్‌కు క్రికెట్ అభిమానులు మద్దతుగా నిలిచారు. కానీ.. ముంబై టీమ్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ముంబై చీఫ్ సెలెక్టర్ మిలింద్ రేగె మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిలింద్ మాట్లాడుతూ.. ఒక బ్యాటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ పని పరుగులు చేయడం మాత్రమేనని.. టీమిండియాలో చోటు దక్కుతుందా? లేదా? అన్నది అతని చేతుల్లో లేని అంశమని చెప్పాడు. మన చేతుల్లో లేనిదాని గురించి మాట్లాడటం అనవసరమని, ఇలాంటి పిచ్చి మాటలకు బదులు బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టాలని సూచించాడు. ‘ఆటను కొనసాగిస్తూ.. మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉండాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా సర్ఫరాజ్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి’ అని మిలింద్ రేగె అన్నారు. కాగా.. సర్ఫరాజ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మిలింద్ మాట్లాడినట్లు క్రికెట్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. సెలెక్టర్లపై ఘటూ వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు కూడా ఏం సాధించలేదనే విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Making Chief selector Milind Rege has criticised 35-year-old batter Sarfaraz Khan for some of the comments he made publicly after not going picked in India’s squad for the first two Tests against Australia. #politics #milindrege #sarfarazkhan #australia #explore #explorepage pic.twitter.com/GfMNh4jidC
— Daily News (@daily_news88) January 21, 2023