ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతున్న బెంగాల్ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ తొలిసారి టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో విండీస్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోని సలహాలను గుర్తు చేసుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తన ఆటిట్యూడ్, కెప్టెన్సీ, బ్యాటింగ్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కేవలం అభిమానులు మాత్రమే అప్ కమింగ్ యంగ్ క్రికెటర్లు కూడా ధోనీనే ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పటికే ఎంతో మందికి కీలక సలహాలు ఇచ్చిన మాహీ తాజాగా టీమిండియా అప్ కమింగ్ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడని తెలియజేసాడు. ధోని ఇచ్చిన ఈ సలహా ఏకంగా తన కెరీర్ నే మార్చేసింది అని ముకేశ్ తెలిపాడు. ఇటీవలే టీమిండియాకు సెలక్ట్ అయిన ముకేశ్.. ధోనిని ప్రశంసిస్తూ ఎమోషనల్ వ్యాఖ్యలు చేసాడు.
బెంగాల్ కి చెందిన ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2023 లో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ యువ బౌలర్ ని ఏకంగా 5 కోట్ల 50 లక్షలకు దక్కించుకుంది. ఈ సీజన్ లో మొత్తం 10 మ్యాచులు ఆడిన ముకేశ్ 7 వికెట్లు తీసి పర్వాలేదనిపించారు. ఇక తాజాగా వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా తొలి సారి టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. ఐపీఎల్ లో అంతగా రాణించకపోయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 33 మ్యాచులోనే 123 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో నెట్ బౌలర్ గా సెలెక్ట్ చేశారు. తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికైన ముకేశ్ ఎమోషనల్ అయ్యాడు. తన జీవితానికి ధోని ఇచ్చిన సలహాలు ఆచరణలో పెట్టానని తెలియజేసాడు.
“చిన్నప్పటినుంచి ధోని అంటే నాకు విపరీతమైన పిచ్చి. అతన్ని కలవగానే ఎన్నో అడగాలి అనుకుని కళలు కనేవాడిని. అయితే ఐపీఎల్ సమయంలో నాకు ధోనీని కలిసే అవకాశం వచ్చింది. దీంతో నా మనసులో ఉన్న సందేహాన్ని అడిగేసాను. మీరు ఒక కెప్టెన్ గా వికెట్ కీపర్ గా బౌలర్లకు ఏం చెబుతారు అని అడిగాను. దీనికి ధోని నా భుజం మీద చేయి వేసి దేనికి భయపడకు. రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేయాల్సింది చేసేయ అని చెప్పాడు. ఆ మాట్లాడు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా బౌలింగ్ చేయాలో ఇషాంత్ శర్మ నాకు నేర్పాడు. ఏ బంతిని ఏ యాంగిల్లో వేయాలో నాకు నేర్పించాడు. అని ఈ సందర్భంగా తెలియజేశాడు. మొత్తానికి మరొకరి జీవితంలో ఒక కీలకమైన సలహా ఇచ్చి ఆదర్శంగా నిలవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.