టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఏం మాట్లాడుకున్న అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా కోహ్లీకి సంబంధించి కొత్త వార్త ఒకటి చెప్పుకొచ్చాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమెస్కె ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోహ్లీకి ఒక డిజార్డర్ ఉందని ఆయన తెలియజేశాడు.
స్టార్ క్రికెటర్లకి సంబంధించి కొత్త వార్త ఏది తెలిసిన వెంటనే వైరల్ అవుతుంది. ఇక విరాట్ కోహ్లీ లాంటి లాంటి యూనివర్సల్ క్రికెటర్ గురించి అయితే క్షణాల్లో ఆ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతుంది. సోషల్ మీడియాలో కోహ్లీ ఒక్క పోస్టు పెడితే గంటలో ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కోహ్లీకి సంబంధించి కొత్త వార్త ఒకటి చెప్పుకొచ్చాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమెస్కె ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోహ్లీకి ఒక డిజార్డర్ ఉందని ఆయన తెలియజేశాడు. కోహ్లీ ఏంటి.. ఈ డిజార్డర్ ఏంటి అనుకుంటున్నారా .. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీంఇండియాలో కోహ్లీ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కోహ్లీ బ్యాటింగ్ గురించి, అతని రికార్డుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక వ్యక్తిగతంగా కోహ్లీ ఫిట్ నెస్ వరల్డ్ క్రికెట్ లోనే టాప్. అలాంటి కోహ్లీకి ఓసీడి డిజార్డర్ ఉందని ఎమెస్కె ప్రసాద్ అంటున్నాడు. ఎక్కడైనా చిన్న మరక కనిపిస్తే వెంటనే దానిని తుడిచేసి మరల టవల్ అక్కడ పెట్టేస్తాడంట. ఎమెస్కె ప్రసాద్ 2016 లో టీమిండియాకు చీఫ్ సెలెక్టర్ గా నియమించబడ్డాడు. దాదాపు నాలుగేళ్ల పాటు జట్టుతోనే ట్రావెల్ అయ్యాడు. మరి ఈ సమయంలో ఎమెస్కె ప్రసాద్ కోహ్లీని ఏమైనా గమనించి ఉంటాడదేమో లేకపోతే గ్రౌండ్ లో కోహ్లీ అగ్రెస్సివ్ చూసి ఇలా ఏమైనా అనుకుంటున్నాడో తెలియాల్సి ఉంది. అంతేకాదు కోహ్లీ కళ్ళు పెద్దవి చేసి ఎదటివారి కళ్ళలోకి చూసినప్పుడు బయపడతాడంట. మొత్తానికి కోహ్లీకి ఒసిడి డిజార్డర్ ఉందని ఎమెస్కె ప్రసాద్ చెప్పడం గమనార్హం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.