ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా రోహిత్ సూపర్ హిట్ అవ్వడంతో అతని సక్సెస్‌లో తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలని ప్రసాద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మన తెలుగు వాడనే సంగతి తెలిసిందే. 1999-2000 మధ్య కాలంలో టీమిండియా తరఫున 6 టెస్టు, 17 వన్డేలు ఆడారు. క్రికెటర్‌గా చేసింది పెద్దగా ఏమి లేకపోయినప్పటికీ.. భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా తనదైన ముద్ర వేయగలిగారు. 21 సెప్టెంబర్ 2016 లో తొలి సారి టీమిండియా సెలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ 4 మార్చ్ 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. సరిగ్గా ఈ 4 సంవత్సరాలపాటు భారత్ తిరుగులేని జట్టుగా అవతరించింది. ఇందులో విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి పాత్ర ఎంతో కీలకమైంది. అయితే జట్టు విజయాల్లో కెప్టెన్, కోచ్ పాత్ర ఎంత ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ కూడా ఆటగాళ్ల ఎంపిక విధానంలో కీలక పాత్ర వహిస్తుంది. అయితే ఆటగాళ్ల ఎంపిక విషయం మాత్రమే వీరి చేతిలో ఉంటుంది కానీ ఒక్కసారి ఎంపిక చేసిన తర్వాత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనతో వారికి సంబంధం ఉండదు. వారు హిట్ అయితే ఆ క్రెడిట్ ముందుగా వారికి ఆ తర్వాత కెప్టెన్, కోచ్ లకు వెళ్తుంది.
సెలక్షన్ కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు అనేది వాస్తవం. కానీ ప్రసాద్ మాత్రం రోహిత్ శర్మ సెంచరీ విషయంలో తనకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని పేర్కొనడంతో ఆసక్తికరంగా మారింది. భారత్ -ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ లో తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఈ విషయంపై రోహిత్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న తరుణంలో .. భారత మాజీ సెలెక్టర్ ప్రసాద్ రోహిత్ శర్మ సెంచరీ విషయంలో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేయడం విశేషం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌లో తెలుగు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రసాద్ రోహిత్ శర్మ ని ప్రశంసిస్తూనే.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.
‘రోహిత్ శర్మ ఓపెనర్ గా అదరగొడుతున్నాడు. అతను ఓపెనర్ గా మారడంలో తన పాత్ర కూడా ఉంది . సౌతాఫ్రికా, భారత్ కి వచ్చినప్పుడు అప్పటి ఓపెనర్లు మురళి విజయ్,పృథ్వీ షా వరుసగా విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ని ఓపెనింగ్ చేయమని నేనే సూచించాను. దానికి రోహిత్ కూడా జట్టు అవసరాల కోసం ఏ స్థానంలోనైనా ఆడడానికి నేను సిద్ధం అని చెప్పడంతో .. రోహిత్ టెస్టుల్లో తొలిసారి ఓపెనింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.’ అని పేర్కొన్నారు. ప్రసాద్ ఈ విషయాన్ని సరదాగా చెప్పినా.. క్రికెట్ అభిమానులు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఓ ఆటగాడు హిట్ అయితే క్రెడిట్ కోరుతున్న ప్రసాద్.. విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ కోసం అంబటి రాయుడుని బలి చేసిన విషయంపై స్పందించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. అలాగే వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి, రాయుడి కెరీర్ దెబ్బతినడానికి కూడా కారణం తాను, తన ఎంపిక అని ప్రసాద్ ఆ క్రిడిట్ కూడా తీసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma plays a captain’s knock.@BCCI@ImRo45 @ICC #INDvsAUS #MSKPrasad pic.twitter.com/RAt7693I43
— MSK PRASAD’S INTERNATIONAL CRICKET ACADEMY (@Academy_msksica) February 10, 2023