టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి.. బైక్, కార్ల పట్ల ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్యారేజీలోకి అడుగుపెడితే ఎన్నో రకాల వాహనాలు దర్శమిస్తాయి. అన్నిరకాల కార్లు ఉన్నప్పుడు.. మన మహేంద్రుడు ఎందులో చక్కర్లు కొడతాడో.. మనకు అంతుపట్టకపోవడం సహజం. తాజాగా.. భారత మాజీ కెప్టెన్ రోవర్ మినీ కూపర్ స్పోర్ట్ అండ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 అనే రెండు పాతకాలపు కార్లతో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రోవర్ మినీ కూపర్ స్పోర్ట్ 2000
మహేంద్ర సింగ్ ధోనీ చాలా ప్రత్యేకమైన రోవర్ మినీ కూపర్ స్పోర్ట్ 2000ను నడుపుతున్నట్లు కనిపించాడు. ఇది మినీ తయారు చేసిన చివరి కార్లలో ఒకటి. ఈ కారు రెడ్ కలర్ వేరియంట్, కారు బాడీపై తెల్లటి రంగు చారలు ఉన్నాయి. కారుకి 12-అంగుళాల లగ్జరీ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారు ఇంజిన్ 1.3-లీటర్ BMC ఆస్టిన్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 63 PS పవర్, 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110
క్లాసిక్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110లో కూడా మహేంద్రుడు చక్కర్లు కొట్టాడు. ఈ కార్ ధోని వద్ద ఉన్న అత్యుత్తమ పాతకాలపు కార్లలో ఒకటి అని తెలుస్తోంది. ధోని ఇందులో ప్రయాణించడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడట.
పైన పేర్కొన్న కార్లే కాకుండా.. ధోని గ్యారేజీలో స్టార్-స్టడెడ్ మోడళ్లతో నిండిన పోంటియాక్ ఫైర్‌బర్డ్, రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో వంటి మోడల్స్ ఉన్నాయి, ఇవి భారత రహదారులపై చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కార్లు కాకుండా ధోనీకి ఒకప్పుడు ఆర్మీలో ఉపయోగించిన నిస్సాన్ జోంగా కూడా ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni bought a classic 1971 Series 3 Land Rover at an online classic car auction#Dhoni #LandRover #Auction #classic #classiccars #classiccar pic.twitter.com/16Rkjparp1
— PressboltNews (@pressboltnews) January 21, 2022
ఇది కూడా చదవండి: MS Dhoni: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న ఎంఎస్ ధోనీ..
ఇది కూడా చదవండి: Michael Bracewell: 12 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ ఘనత సాధించిన న్యూజిలాండ్ నయా సంచలనం