భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పట్టుకున్నదల్లా బంగారమే అవుతోంది. టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైన వెంటనే భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన ధోని.. ఆ తర్వాత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. 2011లోనూ భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ధోని నిలిచిపోయాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చిన ధోని.. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను నంబర్ వన్ టీమ్‌గా నిలిపాడు. మొత్తం నాలుగు సార్లు సీఎస్‌కేను ఐపీఎల్ ఛాంపియన్ చేశాడు. ఇలా ధోని చేతి పడితే చాలు.. కప్పు రావాల్సిందే అనే రితీలో ధోని క్రికెట్ కెరీర్ సాగింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఆ తర్వాత తన వ్యాపారాలు చూసుకోవడంతో పాటు సరదాగా పలు రకాల క్రీడల్లో పాల్గొంటున్నాడు.
తాజాగా.. రాంచీలో నిర్వహించిన జేఎస్‌సీఏ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ డబుల్స్ విభాగంలో పోటీ పడిన ధోని. ఇక్కడ కూడా తన సత్తా చాటాడు. తన పార్టనర్ సుమీత్ కుమార్ బజాజ్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను గెలిచాడు. ఆరు రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంట్‌లో ధోని సుమీత్ జోడి సంచలన విజయాలు నమోదు చేసింది. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో విజేతగా నిలిచి.. డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో ధోనికి టెన్నిస్‌లో సైతం తిరుగులేదని అతని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ధోని కప్పు అందుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కప్ కొట్టకపోవడంపై నిరాశగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్.. ధోని మరోసారి కప్పు కొట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
MS Dhoni wins the JSCA Tennis Championship in doubles event. pic.twitter.com/wfZeQKRgiU
— Johns. (@CricCrazyJohns) November 15, 2022