ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చిన టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన CSK ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేదు. చివరి 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండంటే రెండే మ్యాచ్‌ల్లో గెలిచింది. దీన్ని బట్టి ఆ జట్టు ఎంత దారుణంగా విఫలం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. చెన్నై ఇంతలా భంగపాటుకు గురికావడానికి కెప్టెన్సీ మార్పే కారణం అయింది. ఈ ఏడాది టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల ముందు ధోని CSK కెప్టెన్సీ వదిలేయడంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ ఆ బాధ్యతను జడేజా నెత్తిన మొపింది.
ఆ భారం మొయలేక జడేజా వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతిన్నది. దీంతో.. మళ్లీ ధోనీకే ఆ భారం అప్పగించింది చెన్నై మేనేజ్‌మెంట్. అలా కెప్టెన్నీ తీసుకున్నాడో లేదో.. చెన్నై విజయం సాధించింది. అది కూడా డామినేటింగ్ విక్టరీ. బ్యాటింగ్‌లో 200 పైచిలుకు పరుగుల కొట్టి.. టోర్నీలో ఒక్కసారిగా తమ సత్తా ఇది అని చాటిచెప్పిన గెలుపది. మరి ఇన్ని రోజులు ఒక బలహీనమైన, ముసలి టీమ్‌లా కనిపించిన CSK ఒక్కసారిగా ఇలా పులిలా మారడం వెనుక ఉన్న కారణం ఏంటి? అంటే.. అందరూ ముక్తకఠంతో చెప్పే మాట.. ధోని కెప్టెన్సీ తీసుకోవడం వల్లేనని. ధోని కెప్టెన్‌గా ఉంటే జట్టు ఎందుకు అంత పవర్‌ఫుల్ మారుతుందంటే..? అది అతని జాతక బలమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
మన దేశంలో వందలో తొంభై శాతంమంది నమ్మే.. జాతకాల ప్రకారం చూస్తే.. ధోనిది తిరుగులేని జాతకమంట. అతను పట్టిందల్లా బంగారమే. నిజానికి ధోని కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ విషయం నిజమని నమ్మక మానలేం. జట్టులో యువరాజ్ సింగ్, సెహ్వాగ్ లాంటి సీనియర్లు, స్టార్లు ఉండగా.. ధోనికే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ధోని కెప్టెన్సీలో టీమిండియా అండర్ డాగ్‌గా తొలి టీ20 వరల్డ్‌లో అడుగుపెట్టి విశ్వవిజేతగా నిలిచింది. 1983 తర్వాత ప్రపంచ కప్ నెగ్గని జట్టు 2011లో వన్డే ఛాంపియన్ అయింది కూడా ధోని కెప్టెన్సీలోనే. జట్టును మూడు ఫార్మాట్లలో విజయవంతంగా కొన్ని ఏళ్లపాటు నడిపాడు. ఇందంతా ధోని జాతక బలంతోనే జరుగుతుందట.
1981 జూలై 7న ధోని జార్ఖండ్‌లో జన్మించాడు. అతని రాశి కర్కాటక(క్యాన్సర్) రాశి. ధోని పుట్టిన సమయం అతని రాశి ప్రకారం చూస్తే.. ధోని జీవితం ఒక అద్భుతమంట. ఆజన్మాంతం కూడా ధోనికి ప్రజల్లో ఆదరణ దక్కుతుందట. భవిష్యత్తులో ధోని రాజయకీల్లో కూడా రాణించే అవకాశం ఉందట. ధోని రాజకీయాలు వద్దనుకున్నా.. అతని జాతక చక్రం ప్రకారం అది జరిగి తీరుతుందట. రాజకీయ ప్రవేశమే కాకుండా.. ప్రతిష్టాత్మకమైన పదవిని కూడా అలంకరిస్తాడంట ధోని. ప్రస్తుతం ధోని గురించి ఈ ఆసక్తి విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంతటి బలమైన జాతకం ధోనికి ఉంది కాబట్టే.. వదిలేసిన కెప్టెన్సీ మళ్లీ చేబట్టగానే జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని కొంతమంది ధోని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి.. ప్లేఆఫ్స్‌కు చేరి.. కప్పు కొట్టినా ఆశ్చర్యపోయాల్సి పని లేదంటున్నారు. ఎందుకంటే ధోని అంటే అదృష్టం.. ధోని అద్భుతం.. ధోని అంటే విజయం.. ధోని అంటే నమ్మకం.. అంటున్నారు అతని ఫ్యాన్స్ మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: కెప్టెన్‌గా జడేజా ఎందుకు విఫలం అయ్యాడో చెప్పిన ధోని
#MS Dhoni retired. His #horoscope shows great leader by Jupiter,Saturn,Moon in Nav pancham yog. pic.twitter.com/SbLtpNfQqy
— AskJyotishi (@AskJyotishi) December 30, 2014
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.