భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ వ్యక్తిగత స్వేచ్ఛపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్‌లో ఉన్నాడు. ధోనితో పాటే భార్య సాక్షి సింగ్, కూతురు జీవా కుడా వచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో సాక్షి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”వంద కోట్ల మందిలో 11 మంది మాత్రమే ఆడే జట్టులో ఉన్న క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా క్రికెట్‌ని మతంగా భావించే దేశంలో అభిమానుల ప్రేమను తట్టుకోలేం. ఒక క్రికెటర్‌ను పెళ్లాడితే మా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే భర్తను పెళ్లాడితే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే ఒక ఆటగాడిని పెళ్లి చేసుకుంటే చాలా మార్పులు వస్తాయి. స్వేచ్ఛ ఉండదు. కెమెరాలు వెంటాడుతున్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ దొరకదు.కొందరికి కెమెరాలతో ఇబ్బంది ఉండదు. మరికొందరు చాలా ఇబ్బంది పడతారు. అదీకాకుండా జనాలు, మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు పోస్టు చేయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఎంత క్రికెటర్ల భార్యలమైనా మాకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. బయట మాకు ఎలాగు అవకాశం లేదు.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మా స్వేచ్ఛను ఉపయోగించుకోవాలనుకుంటాం. కానీ కొందరు దీనిని కూడా దూరం చేస్తున్నారు. ఇలాంటివి పట్టించుకోవడం వల్ల ఒత్తిడి తప్ప ఇంకేమి ఉండదు” అని అన్నారు.
కాగా ప్రముఖుల కుటుంబసభ్యులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రికెటర్లను డెమీ గాడ్స్‌గా భావించే మన దేశంలో వారి కుటుంబసభ్యులు కూడా చాలా పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. వారిని ఎక్కువగా ఓన్ చేసుకోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తాయి. మరి ధోని సతీమణి సాక్షి చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#SakshiDhoni reveals the challenges that come with being married to cricketing icon, MS Dhoni@msdhoni https://t.co/FP6K2lRoCn
— Zee News English (@ZeeNewsEnglish) March 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.