సినీ నటులు, క్రికెటర్లు… అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందుకోసం ఇది అది అని తేడా లేకుండా సోషల్ మీడియాలో ప్రతిచోటా కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాలో డైలీ లేదంటే వారానికి ఓసారైనా కచ్చితంగా ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారు. ఇదంతా ఓవైపు కొందరు స్టార్ క్రికెటర్లు మాత్రం సామాజిక మాధ్యమాల్లో అస్సలు కనిపించరు. ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్న సరే వేరే ఎవరో వీడియోలు తీస్తే తప్పితే.. అక్కడికి వచ్చి వెళ్లారని కూడా తెలియదు. ఈ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ కచ్చితంగా ఉంటాడు. మైదానంలో మాత్రమే కనిపిస్తాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా దిగ్గజ క్రికెటర్లలో ధోనీ పేరుని అస్సలు తీయలేం. ఎందుకంటే ఓ సాధారణ వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చిన మహీ.. అనుకోని పరిస్థితుల్లో కెప్టెన్ అయ్యాడు. అయినా ఏం భయపడకుండా జట్టుని ముందుండి నడిపించాడు. అలా భారత జట్టు చరిత్రలోనే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. కేవలం ఆరేళ్ల వ్యవధిలో టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు.
ఇక ధోనీ, తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. ఖాళీ టైంలో కూతురు జీవి, భార్య సాక్షితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు. ధోనీకి సంబంధించిన వీడియోలన్నీ కూడా సాక్షినే ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ధోనీ అకౌంట్ లో అయితే చివరగా అప్పుడెప్పుడో 2021 జనవరి 8న స్ట్రాబెర్రీ సాగుకు సంబంధించిన ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ట్రాక్టర్ తో పొలం దున్నతున్న వీడియోని పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. ధోనీ పొరపాటున వీడియో పోస్ట్ చేశాడమో అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్ ధోనీకి చివరదని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో? మరి రెండేళ్ల తర్వాత ధోనీ ఇన్ స్టాలో కనిపించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.