మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్పగానే మనలో చాలామందికి 2011 వరల్డ్ కప్ గుర్తొస్తుంది. ఎందుకంటే ధోనీ క్రికెటర్ గా ఎన్ని ఘనతలు, రికార్డులు సాధించినా సరే మహీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే అదే. ఇక అదే వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ అయితే భారత్ క్రికెట్ ని ప్రేమించే ఏ ఒక్కడైనా సరే అస్సలు మర్చిపోడు. ఇక ఆ తర్వాత కూడా ధోని వల్ల భారత జట్టులో చాలా మార్పులు జరిగాయి. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టుగా మారడంలో కెప్టెన్ గా ధోని కీలకపాత్ర పోషించాడు. అలాంటి ధోని.. ప్రస్తుతం ఓ విషయంలో మాత్రం తప్పు చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ధోని జీవితం తెరిచిన పుస్తకం. ఎందుకంటే క్రికెటర్ గా పీక్ స్టేజీలో ఉన్న టైంలోనే ధోని బయోపిక్, ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఝార్ఖండ్ లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరగడం, అనుకోకుండా క్రికెట్ లో అడుగుపెట్టినప్పటికీ.. తండ్రి ఒత్తిడి వల్ల రైల్వే టికెట్ కలెక్టర్ గా మారాడం. క్రికెట్ పై మనసు ఉండటంతో చేస్తున్న టీసీ ఉద్యోగం బోర్ కొట్టడం, ఆ తర్వాత జాబ్ వదిలేసి కొన్నేళ్లు కష్టపడి జాతీయ జట్టులోకి రావడం.. ఆ తర్వాత కెప్టెన్ గా అద్భుత విజయాలు, టీ20 వరల్డ్ కప్- వన్డే ప్రపంచకప్- ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించడం, ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నాలుగుసార్లు విజేత కావడం.. ఇలా ఏ విషయం చూసుకున్నా ధోని పట్టిందల్లా బంగారమే.
ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధోనీ.. క్రికెటర్ గా చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. వందల కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతూ విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్నేళ్ల జీవితంలో ధోని కోప్పడటం.. చాలా తక్కువ సందర్భాల్లోనే జరిగింది. ఎందుకంటే మ్యాచ్ జరిగే టైంలో కావొచ్చు, బయట కావొచ్చు ఎప్పుడూ చాలా కామ్ గా ఉంటాడు. అందుకే ధోనిని మిస్టర్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. అలాంటి ధోని.. ఇప్పుడు సినిమా సొంత నిర్మాణ సంస్థ స్థాపించి, ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో తమ అభిమాని క్రికెటర్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సినిమా స్టార్ హీరోలు, అభిమానులు, వందల కోట్ల కలెక్షన్స్.. ఇదంతా ఓవైపు మాత్రమే. ఎందుకంటే సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది కేవలం వ్యాపారం మాత్రమే. ప్రస్తుతం ఇండస్ట్రీలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. కరోనా రాకముందు కొద్దో గొప్పో సినిమాలకు ప్రేక్షకులకు వెళ్లేవారు. చూసి ఎంజాయ్ చేసేవారు. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలే భారీ నష్టాలు చవిచూశాయి. ఇక ఓటీటీల వినియోగం పెరిగిన తర్వాత విజయాల శాతం కూడా తగ్గిపోయింది. టాలీవుడ్ తో పాటు దక్షిణాది ఇండస్ట్రీల హిట్ పర్సంటేజ్ 4 శాతం ఉండగా.. బాలీవుడ్ అయితే మరి దారుణంగా ఉంది. ఇలాంటి టైంలో ధోని, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఓ రకంగా డేంజర్ లాంటిదే! దీంతో ‘ధోనికి భారీ మూల్యం తప్పదు’, ‘ఆ దేవుడే కాపాడాలి’ అని అభిమానులు అనుకుంటున్నారు.
MS Dhoni & his wife Saakshi’s production house ‘Dhoni Entertainment’ will produce its 1st feature film in Tamil!
Conceptualised by Sakshi herself, the Tamil film will be a family entertainer that is to be directed by Ramesh Tamilmani. pic.twitter.com/klftJigVsQ
— Christopher Kanagaraj (@Chrissuccess) October 24, 2022
#DhoniEntertainment‘s First movie will have #HarishKalyan in the lead role 👍
Directed by #RameshTamilmani 🎬
Talks going on with #PriyankaMohan to play female lead ❣️
A fun filled family entertainer based movie ✨ pic.twitter.com/K2hiEtLI5A— AmuthaBharathi (@CinemaWithAB) October 25, 2022