మరో రెండు నెలల్లో క్రికెట్ అభిమానులకు ఊపిరి సలపనీయకుండా వినోదం అందించేందుకు ఐపీఎల్ 2023 సీజన్ రానుంది. అంతర్జాతీయ వేదికగాపై చాలా మంది స్టార్ ఆటగాళ్ల ఆటను చూడలేని ఫ్యాన్స్‌కు ఐపీఎల్‌లో వారి ఆట చూసే అదృష్టం దక్కుతుంది. అందులో మరీ ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోనిని మళ్లీ మైదానంలో చూసే ఛాన్స్ వస్తుంది. ఐపీఎల్‌తో పాటు ధోని బ్యాటింగ్, కెప్టెన్సీ చూసేందుకు ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులు సైతం చాలా మంది ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ పుట్టినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని.. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. మధ్యలో రెండేళ్లు సీఎస్‌కేపై నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహిరించాడు.
ఐపీఎల్ 2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకుని.. జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించినా.. కెప్టెన్‌గా జడేజా విఫలం అవ్వడంతో మళ్లీ తప్పని పరిస్థితుల్లో ధోనినే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. ఈ ఐపీఎల్ సీజనే ధోనికి చివరి ఐపీఎల్ అవుతుందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించి.. ఐపీఎల్‌కు కూడా ధోని పూర్తిగా గుడ్‌బై చెప్తాడంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోని అదరగొట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఫ్యాన్స్‌కు ఏది కావాలో అది చేసే ధోని.. ఇప్పుడు కూడా వారిని సంతోష పరిచి.. చెన్నైను ఐదో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. తన సొంతూరు రాంచీలోని క్రికెట్ స్టేడియంలో ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ధోని భారీ షాట్లతో, భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ షాట్లు చూస్తుంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్‌లో వింటేజ్ ధోనిని చూడటం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా.. ఇటివల రాంచీ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ చూసేందుకు ధోని స్టేడియానికి వచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు కూడా టీమిండియా ఆటగాళ్లను కలిసి, కొంత సేపు సరదాగా ముచ్చటించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ప్రాక్టీస్‌లో ధోని ఆడుతున్న షాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni smashing 6s during today’s practice session! #Dhoni #IPL2023 #CSK @msdhoni pic.twitter.com/ZiVROmMVs4
— MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2023