టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మంచిమనసు గురించి మనందరకి సుపరిచితమే. కేవలం ఆటతోనే కాకుండా తోటి క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు మన ధోని భాయ్. తాజాగా ధోని గొప్పమనసు మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు మన జార్ఖండ్ డైనమైట్. తన సంతకంతో కూడిన జెర్సీని రవూఫ్‌కు పంపి అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తోన్న పాక్ యంగ్ క్రికెటర్‌కు ఓ దిగ్గజ ఆటగాడు జెర్సీ పంపించాడంటే మామూలు విషయమేమీ కాదు. అందుకే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఈ పాక్ క్రికెటర్.
The legend & capt cool @msdhoni has honored me with this beautiful gift his shirt. The “7” still winning hearts through his kind & goodwill gestures. @russcsk specially Thank you so much for kind support. pic.twitter.com/XYpSNKj2Ia
— Haris Rauf (@HarisRauf14) January 7, 2022
“ఎంఎస్ ధోని ఎంతో అందమైన బహుమతిని నాకు పంపించాడు. తను ఐపీల్ లో చెన్నై సూపెర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న జెర్సీ ఇది. తన మంచి మనసుతో మహి భాయ్ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’’ అంటూ రవూఫ్ ధోనిపై అభిమానం చాటుకున్నాడు.
Ms Dhoni with CSK’s New Jersey for the IPL 2021.#MSDhoni #CricCLiQ #CSK pic.twitter.com/vIKwGS13gE
— CricCLiQ (@CricCLiQ) March 24, 2021
దీనిపై సీఎస్‌కే మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్ స్పందిస్తూ… ‘‘మా కెప్టెన్ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్న ధోని 2021లో చెన్నై సూపెర్ కింగ్స్ జట్టును చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిన విషయమే . ఇప్పటి వరకు ఐపీల్ లో సీఎస్‌కే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్-2021 సందర్భంగా టీమిండియా మెంటార్‌గా వ్యవహరించిన ధోని… భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించాడు.దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.