అతడంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. అతడి పేరు దేశ ప్రజలకు ఒక ఎమోషన్. ఇంత అభిమానానికి కారణమైన ఈ ఫోటోలోని వ్యక్తిని ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.
అభిమానులని సంపాదించుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటినుంచి కెరీర్ లో ఎన్నో కష్టాలు పడి చివరకు వారు అనుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తారు. ఇంతవరకు వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. చేరాల్సిన గమ్యాన్ని చేరినా.. మళ్ళీ ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చినవారు చాలా మందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అనుకున్న రంగంలో రానిస్తూ అభిమానులని సంపాదించుకుంటారు. అయితే అభిమానుల అంచనాలను మోయాయడం అంత సామాన్యమైన విషయం కాదు. వారు ఆశించింది ఇవ్వడంలో విఫలమైతే నిరాశకు గురవుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అభిమానుల అంచనాలను మాత్రమే కాదు దేశంలో ప్రతి ఒక్కరి అంచనాలను మోస్తూ ఆకాశమంత అభిమానాన్ని సంపాదించాడు.
దేశంలో సినిమా, క్రికెట్ కి ఉండే క్రేజ్ ఎలాంటిదో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఒక్క సారి స్టార్ డం అందుకుంటే మన దేశ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. అలాంటివారిలో కొంతమంది అభిమానులని సంపాదించుకుంటే చాలా కొద్ది మాత్రమే డై హార్డ్ ఫ్యాన్స్ ని సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇదంతా ఈ ఫోటోలో ఉన్న కుర్రాడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ అతడిని గుర్త పట్టారా? చెప్పమంటారా? అతడెవరో కాదు.. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని . అతడంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. అతడి పేరు దేశ ప్రజలకు ఒక ఎమోషన్. 1981 లో రాంచీలో పుట్టాడు ధోని. మొదట్లో ఫుట్ బాల్ అంటే బాగా ఇష్టపడే మాహీ గోల్ కీపర్ గా ఉండేవాడు.
ఇక కెరీర్ లో రైల్వే ఉద్యోగం కూడా చేసిన ధోని.. క్రికెట్ మీద ఉన్న మక్కువతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో మహేంద్రుడు చేసిన త్యాగాలు, పడిన కష్టాలు అతనికి మాత్రమే తెలుసు. వికెట్ కీపర్ గా అంతర్జాతీయ కెరీర్ లో అడుగుపెట్టిన ధోని.. మొదట్లో అందరూ ఇతని హెయిర్ స్టయిల్ చూసి క్రికెట్ లో రాణించడం చాలా కష్టమనుకున్నారు. కానీ ఒక్కసారి మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. దూకుడైన బ్యాటింగ్ తో అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక 2007 నుంచి ధోని దశ మారిపోయిందని చెప్పుకోవాలి. టీమిండియా వన్డే వరల్డ్ కప్ దారుణంగా ఓడిపోవడంతో దారుణమైన విమర్శలు మూట కట్టుకోవాల్సి వచ్చింది. ఈ వరల్డ్ కప్ లో కనీసం సూపర్ 8 కి కూడా చేరుకోలేకపోయింది. ఈ సమయంలో భారత్ క్రికెట్ పతన స్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి.
దీంతో అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేయగా.. కెప్టెన్ గా ఎవరిని ఎంచుకోవాలో సందిగ్ధం లో పడింది బీసీసీఐ. ఈ దశలో తీసుకున్న ఒక సంచలన నిర్ణయం భారత క్రికెట్ ని మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సీనియర్లు ఉన్నప్పటికీ ధోని బుర్రలో ఏదో ఉందని భావించి దిగ్గజాలు, సెలెక్టర్లు ఇతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. వారి తీసుకున్న నిర్ణయం సరైనదని నిరూపిస్తూ .. తనపై పెట్టుకున్న అంచనాలను మోస్తూ తొలి ప్రయతంలోనే టీమిండియాని జగజ్జేతగా నిలిపి తొలి ప్రయతనంలోనే టీ 20 వరల్డ్ అందించాడు. ఇక ఇక్కడ నుంచి మొదలైన మాహీ మానియా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్ కి అందించాడు. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ లో ఒకడిగా పేరు సంపాదించి ఎనలేని అభిమానం సంపాదించి శిఖరాన నిలిచాడు. క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రీడల్లో ఎమోషన్స్ కంట్రోల్ చేయడంలో మహీని మించిన వారు ఎవరూ ఉండరేమో. ఈ లక్షణమే అందరిలో ధోనిని ప్రత్యేకంగా నిలిపింది. ప్రస్తుతం రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ధోని.. కెరీర్ మరింత బాగుండాలని కోరుకుందాం.