బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9న భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగపూర్‌లో తొలి టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు గత ట్రోఫీల్లో ఆటగాళ్లు సాధించిన రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ నెలకొల్పిన ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ధోనికి పొట్టి ఫార్మాట్‌లో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే,టెస్ట్ క్రికెట్లో ధోని రికార్డులు ఏమంత గొప్పగా లేవు, కెప్టెన్‌గా జట్టుకి చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ.. బ్యాటింగ్ పరంగా పర్వాలేదు అనే ప్రదర్శన మాత్రమే చేశాడు. టెస్టుల్లో ధోని తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేకపోయినా… కెప్టెన్‌గా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన పేరిట ఒక అరుదైన రికార్డు లిఖించుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన భారత కెప్టెన్ రికార్డు ధోని పేరిటే ఉంది. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు కెప్టెన్లుగా ధోని కన్నా ఎక్కువ పరుగులు చేసినప్పటికీ.. ఎవరూ కూడా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకోలేదు. కానీ టీమిండియా కెప్టెన్‌గా ధోని రెండు సార్లు ‘ప్టేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ధోని తర్వాత.. కెప్టెన్‌గా ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుని టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే రెండో స్థానంలో నిలిచాడు. 2021లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రహానే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక ధోని నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టాలంటే ఇప్పటిలో ఎవ్వరికి సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలవాలంటే అది శక్తికి మించిన పనే అవుతుంది. వచ్చే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వరకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా? అసలు టెస్టు క్రికెట్ ఆడతాడా? అనేది అనుమానమే. కాబట్టి ధోని సాధించిన ఈ అరుదైన రికార్డు ఇప్పట్లో బద్దలు కొట్టే కెప్టెన్ అయితే లేడనే చెప్పాలి. రికార్డుల సంగతి ఎలా ఉన్నా ఈ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్తరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ధోని నెలకొల్పిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni has the most player of the match by an Indian captain in BGT.
— Johns. (@CricCrazyJohns) February 7, 2023