బంగ్లాదేశ్ పై సూపర్ ఇన్నింగ్స్ తో ఇషాన్ కిషన్ పేరు మారుమ్రోగుతోంది. అయితే ఇది రాత్రికి వచ్చిన అదృష్టం కాదని.. ఇందుకోసం అతను కొన్నేళ్లుగా కఠోర శ్రమ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ ఉత్తమ్ మంజుదార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ఆరేళ్ల వయసులో అతడిని చూసినప్పుడు ఎంతో చక్కగా కవర్ డ్రైవ్స్ ఆడాడని గుర్తు చేసుకున్నాడు. అతను గనుక టీమిండియాకి ఆడకపోతే అతని టాలెంట్ ని వృథా చేసిన వాడు అవుతాడని భావించినట్లు చెప్పుకొచ్చాడు.
అయితే ఇషాన్ కిషన్ ఈ స్థాయికి రావడం వెనుక మాజీ కెప్టెన్ ధోనీ హస్తం కూడా ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ఈ సందర్భంగా కిషన్ సక్సెస్ వెనుక ధోనీ కూడా ఉన్నాడనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇషాన్ కిషన్ టీమిండియాలో అరంగేట్రం చేయక ముందే అతని టాలెంట్ ని ధోనీ గమనించాడు. అతని టాలెంట్ చూసి మెస్మరైజ్ అయిపోయాడు. అతను ఎన్ని ఎక్కువ సంవత్సరాలు టీమిండియాకి ఆడితే.. అంత బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని మంజుదార్ కి కూడా ధోనీ తెలిపాడు. అంతేకాకుండా ఇషాన్ కిషన్ ని క్రికెట్ లో ప్రోత్సహించాలంటూ అతని కుటుంబానికి కూడా ధోనీ సూచించాడు. ఆ తర్వాత క్రికెట్ లో ధోనీ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.
ధోనీ ఎదిగిన తీరు కూడా ఇషాన్ కిషన్ ఎదుగదలకు ఎంతో దోహదపడింది. ఇషాన్ కిషన్ – ధోనీ ఒకే స్టేట్ నుంచి క్రికెట్ కి ప్రాతినిధ్యం వహించడం కూడా ఇందుకు కారణం. ధోనీని చాలా దగ్గరగా చూస్తూ ఎదిగిన ఇషాన్ కిషన్ పై ధోనీ మార్క్ ఎంతో ఉంది. క్రికెట్ లో ఇషాన్ కిషాన్ కెరీర్ పై కూడా ఎంతో ప్రభావం చూపింది. అలా అతనికి తెలియకుండానే ఇషాన్ కిషన్ కెరీర్ లో ఎదగాడినికి పరోక్షంగా ధోనీ ఎంతో పెద్ద కారణంగా మారిపోయాడు. ఇషాన్ రోజుకి 600 వరకు బంతులు ఎదుర్కొంటే.. వాటిలో 200 బంతులను భారీ షాట్లే ఆడేవాడట. అతనిలో ఉన్న ఆ దూకుడుని తగ్గించుకోవద్దని ధోనీ కూడా సూచించినట్లు సమాచారం. ఇంత తక్కువ వయసులోనే ఇషాన్ కిషన్ ఇంతటి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడంపై కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇద్దరు పిల్లల్లో ఒకరిని స్టడీస్ కోసం, ఇంకొకరికి క్రీడల కోసం ప్రోత్సహించారు. అలా ఇషాన్ క్రికెట్ కి రాగా.. అతని సోదరుడు మెడిసిన్ వైపు వెళ్లాడు.
ఇంక ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ విషయానికి వస్తే.. రోహిత్ శర్మకు గాయం కావడంతో ఇషాన్ కిషన్ కు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఇషాన్ కిషన్ ఏ స్థాయిలో ఉపయోగించుకున్నాడో అందరం చూశాం. ఆ ఒక్క ఇన్నింగ్స్ తో ఇషాన్ మొత్తం 10 రికార్డులు క్రియేట్ చేశాడు. మొత్తం 131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్స సాయంతో 210 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపించింది. సచిన్ వంటి మాజీలు సైతం ఇషాన్ కిషన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇషాన్ కిషన్ సక్సెస్ వెనుక ధోనీ ఉన్నాడనే వార్త తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
“MS Dhoni would tell Ishan that if a talent like him doesn’t play for a long time, he’ll be doing injustice to himself”. – Ishan Kishan coach #MSDhoni | #TeamIndia | #IshanKishan pic.twitter.com/71JYnZUYSo
— Nithish MSDian 🦁 (@thebrainofmsd) December 11, 2022