క్రికెట్ సూపర్ స్టార్ ధోని నుంచి తమిళ హాస్య నటుడు యోగి బాబు అదిరిపోయే గిఫ్ట్‌ను అందుకున్నారు. దాన్ని ఎంతో అపురూపంగా పట్టుకుని ఆయన ఫొటోలకు ఫోజులివ్వగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఖాళీగా లేడు. ఐపీఎల్‌లో ఆడుతూ ఒక పక్క తన అభిమానులకు వినోదం పంచుతూనే.. మరో వైపు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలాగే.. ధోని స్కూల్స్ పేరిట క్రికెట్ ట్రైనింగ్ స్కూల్స్‌ను కూడా ప్రారంభించాడు. అలాగే ధోని ఎంటర్మైంట్స్ పేరుతో సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ‘లెట్స్ గెట్ మ్యారిడ్’ పేరుతో వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ హాస్యనటుడు యోగి బాబుకు ధోని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. లెట్స్ గెట్ మ్యారిడ్ సినిమాలో యోగి బాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కంటే ముందు యోగి బాబు నటించిన లవ్ టూడే సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత.. ధోని నిర్మించబోయే చిత్రంలో యోగి బాబు నటించనున్నారు. ఈ క్రమంలోనే ధోనిని కలిసి యోగి బాబుకు.. ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను అందించాడు ధోని.
ధోని ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌తో యోగి బాబు తీసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ధోనిని విపరీతంగా అభిమానించే యోగి బాబు.. తన అభిమాన క్రికెటర్ సంతకం చేసి ఇచ్చిన బ్యాట్‌ను ఎంతో అపురూపంగా పట్టుకుని ఫొటో దిగారు. ఆ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారందరూ కూడా ధోని ఆటోగ్రాఫ్‌ను పొందాలని కోరుకుంటున్న వారే. కానీ.. నటుడు యోగి బాబుకు ఆ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే హాస్యనటుడిగా మంచి పాపులారిటీ ఉన్న యోగి బాబు.. ఇప్పుడు ధోని ఫ్యాన్స్‌కి కూడా చాలా దగ్గర అయిపోయారు. ధోని నుంచి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను అందుకున్న సందర్భంగా యోగి బాబు ట్వీట్ చేశారు. ‘ధోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన బ్యాట్‌ను స్వయంగా ఆయన చేతుల మీదుగానే నాకు అందించారు. ధోని సార్‌కు ధన్యవాదాలు. ’ అంటూ పేర్కొన్నారు. మరి ధోని యోగిబాబుకు బ్యాట్ గిఫ్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Direct from #MSDhoni hands which he played in nets . Thankyou @msdhoni sir for the bat …. Always cherished with the – your cricket memory as well as cinematic memory #dhonientertainmentprod1 #sakshidhoni . pic.twitter.com/2iDv2e5aBZ
— Yogi Babu (@iYogiBabu) February 15, 2023