టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయన ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ గానే ఉంటారు. అతను ఏం చేసిన ప్రత్యేకమే. అందుకే క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఐపీఎల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభిమానలకు తనకు నిత్యం ఏదో రకంగా ట్రీట్ ఇస్తూనే ఉంటాడు. ధోనికి సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా మిస్టర్ కూల్ కి సంబంధించిన అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన ఓ వ్యాధి ఇబ్బంది పెడుతుండటంతో ఓ మారుమూల గ్రామానికి వెళ్లి రూ.40ల చికిత్స తీసుకున్నాడంట.
ఐపీఎల్-2022లో చెన్నైసూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసినప్పటి నుంచి ధోని తన హోమ్ టౌన్ అయిన రాంచికి వెళ్లి అక్కడ సందడి చేస్తున్నాడు. గతంలో కూడా అక్కడ వ్యవసాయ పనులు చేస్తూ సాధారణ జీవితం గడిపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చూపించాడు మిస్టర్ కూల్ ధోని. అది ఏమిటంటే.. గత నెల రోజులుగా మెకాలి నొప్పికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పెద్ద డాక్టర్ కు చూపించుకోకుండా, కేవలం నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నాడు. ఆయన తలచుకుంటే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో క్షణాల్లో చికిత్స తీసుకోవచ్చు. కానీ కేవలం రూ.40 ఫీజుతో చికిత్స తీసుకుని తన సాధాసీదా జీవన విధానాన్ని మరోసారి చూపించాడు. మోకాళ్ల నొప్పుల చికిత్స కోసం ధోని ప్రతి 4 రోజులకు ఒకసారి నాటు వైద్యుడిని కలుస్తున్నాడంట.
అయితే నాటు వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నందుకు కేవలం రూ.40 మాత్రమే ఇచ్చాడంట. రాంచికి 70 కిలో మీటర్ల దూరంలోని లాపుంగ్ లోని కటింగ్ కెలా బాబా గల్లాలీ ధామ్ లో వందన్ సింగ్ ఖేర్వార్ వద్ద ధోని చికిత్స పొందుతున్నాడు. ధోని మోకాళి సమస్యకు హెర్బల్ మెడిసిన్ తో చికిత్స పొందుతున్నాడని వందన్ చెప్పుకొచ్చాడు. ఈ మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్ మాత్రం తన దూకుడు ఇంకా తగ్గించలేదు. ఇటువంటి పరిస్థితలో అతని మోకాళ్ల నొప్పి పూర్తిగా నయం కావాలని, అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. ధోనిచూపించిన సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: KL Rahul: రాబోయే టీ20 వరల్డ్‌కు దూరం కానున్న కేఎల్ రాహుల్!