కెప్టెన్ కూల్‌గా పేరుతెచ్చుకున్న ఎంఎస్ ధోని ఆగ్రహానికి గురవ్వడం చాలా అరుదు. అందులోనూ సొంత జట్టు ఆటగాళ్లపై అయితే కోపం చూపించడు. అలాంటిది తన జట్టు కెప్టెన్‌పైనే ధోని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై దారుణ ఓటమిని చవిచూసింది.
ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందే CSK కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే. ధోని స్థానంలో ఆ టీమ్ ఆల్‌రౌండర్ జడేజా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడేజా అనుభవం లేమితో సతమతమయ్యాడు. ఫేలవ నిర్ణయాలతో కెప్టెన్‌గా మెప్పించలేకపోయాడు. డీఆర్‌ఎస్ కోరడంలోనూ జడేజా తొందరపాటు కనిపించింది. దాంతో.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. మైదానంలోనే అతనిపై కోప్పడుతూ కనిపించాడు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో శామ్ బిల్లింగ్స్ రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి అతని బ్యాట్‌కి కనెక్ట్ కాలేదు. దాంతో.. ఫ్యాడ్‌ని తాకిందని భ్రమపడిన చెన్నై టీమ్.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ అనిల్ కుమార్ చౌదరి ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. బంతి ఫ్యాడ్‌కి తాకిందని భ్రమపడినజడేజా.. ధోనీ అభిప్రాయం తీసుకోకుండానే డీఆర్‌ఎస్ కోరాడు. కానీ.. రిప్లైలో బంతి గ్లోవ్‌కి తాకినట్లు తేలింది. దాంతో.. అంపైర్ తన మునుపటి నిర్ణయానికే కట్టుబడగా.. చెన్నై టీమ్ రివ్యూ కోల్పోయింది.
జడేజా అనవసరంగా రివ్యూని వృథా చేయడంతో ధోనీ అతనిపై కోప్పడుతూ కనిపించాడు. బ్యాటింగ్‌లో తన సహజశైలికి భిన్నంగా ఆడిన జడేజా.. 28 బంతుల్లో కేవలం ఒక్క సిక్స్ సాయంతో కేవలం 26 పరుగులే చేశాడు. అతని స్లో బ్యాటింగ్ ప్రభావం చెన్నై టీమ్‌పై తీవ్రంగా పడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేయగా.. 9 బంతులు మిగిలి ఉండగానే 133/4తో కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించింది. ఇలా తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరిస్తూ జడేజా ఒత్తిడికి గురయ్యాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్ మనసు గెలుచుకున్న KKR ప్లేయర్! ఏకంగా ధోనితో పోలిక
ICYMI: A massive roar and a warm reception by the Wankhede crowd for the legendary @msdhoni 😍 💛 👏#TATAIPL | #CSKvKKR pic.twitter.com/6ZecoUHgbU
— IndianPremierLeague (@IPL) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.