చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోని సిక్స్ లు, ఫోర్లలో రెచ్చిపోయాడు. తనలో పస ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించాడు.
ఐపీఎల్ 2023 మహా సంగ్రామం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం(మార్చి 31) న ఈ క్రికెట్ యుద్ధానికి తెరలేవనుంది. ఇక ఆరంభ మ్యాచ్ లోనే ఐపీఎల్ హాట్ ఫెవరెట్ జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై హోం గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోని సిక్స్ లు, ఫోర్లలో రెచ్చిపోయాడు. తనలో పస ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ధోని సిక్స్ లు కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్ర వేసి.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ గా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ కప్ ను అందించాడు. ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కోసం సిద్దం అవుతున్నాడు ధోని. తాజాగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో బరిలోకి దిగిన మిస్టర్ కూల్.. భారీ షాట్స్ తో విరుచుకుపడ్డాడు. సిక్స్ లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ధోని సిక్స్ లు కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా చెన్నై తన తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఇక చెన్నై జట్టు రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, మెుయిన్ అలీ, శివమ్ దుబే, జడేజా, ధోనిలతో పటిష్టంగా ఉంది. అయితే చాలా మంది ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటున్న వాళ్లకు ధోని తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ లో కొట్టిన సిక్స్ లతో సమాధానం చెప్పాడు అంటున్నారు ఈ వీడియో చూసిన అభిమానులు. గత నెల నుంచే ధోని ప్రాక్టీస్ మెుదలు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈసారి చెన్నైకి ఎలాగైనా కప్ తీసుకురావాలని ధోని ఉవ్విళ్లూరుతున్నాడు. దానికి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో కొట్టిన సిక్స్ లే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
MS Dhoni to fans : 🙏😍 !! @MSDhoni #IPL2023 #WhistlePodu pic.twitter.com/GoziuvOiEo
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) March 28, 2023