భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొత్త అవతాహారంలో దర్శనమిచ్చాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో కూరగాయల్ని పండిస్తూ ప్రకృతిలో ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నాడు. అలా అని ఊరుకుంటున్నాడా! అంటే.. పొరపాటు. ‘అన్నీ బాగున్నప్పుడే ఇల్లు సర్దుబెట్టుకోవాలన్నట్లు’ కమర్షియల్ యాడ్స్ చేస్తూ.. డబ్బులు వెనుకేసుకుంటున్నాడు. ఈ తరుణంలో ‘గురూజీ’ అవతారంలో కనిపిస్తూ.. హితబోధ చేస్తున్నాడు. ఇదంతా దేనికంటారా.. అగర్‌బత్తీల యాడ్ కోసం..
‘జెడ్ బ్లాక్’ అగర్‌బత్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ధోనీ.. సంస్థ నూతన ప్రచార కార్యక్రమంలో ‘గురూజీ’ అవతారంలో కనిపించాడు. పసుపు రంగు కుర్తా ధరించి చేతికి దండ వేసుకొని.. ఓ ఫొటోలో సంస్కారం చేస్తుండగా.. ఇంకో ఫొటోలో ఉపదేశం చేస్తున్నట్లు ఉన్నారు. గురూజీ అవతారంలో ఉన్న ధోనీని చూసి మొదట నెటిజన్లు షాకయినా.. ఆ తర్వాత అగర్‌బత్తి యాడ్ కోసం అలా మారాడని తెలుసుకుని ఈ గెటప్‌లో కూడా బాగున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా, ఐపీఎల్ 2022 తర్వాత తెరపై మహేంద్రుడు కనపడడం ఇదే తొలిసారి. 2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన ఎంఎస్ ధోనీ 2020లో ఆటకు గుడ్ బై చెప్పారు. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నదండోయ్.. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడు. ఈ విషయంపై ఇప్పటికే.. క్లారిటీ కూడా ఇచ్చాడు. ‘గురూజీ’ వేషధారణలో ధోనీ ఎలా ఉన్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rishabh Pant, Urvashi Rautela: ఫేమ్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్ ఫైర్
ఇదీ చదవండి: Dronavalli Harika: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటూ క్రీడాలోకం ప్రశంసలు!