పృథ్వీ షా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇన్‌స్టాగ్రామ్ మోడల్ సస్నా గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చెంపపై, చెస్ట్‌పై పృథ్వీ షా..
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ముంబైకి చెందిన మోడల్ సప్నా గిల్.. పృథ్వీ షా తనను లైంగికంగా వేధించాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటివల పృథ్వీ షాపై దాడి జరిగిన సంఘటన సంచలనంగా మారింది. ఆ దాడి ఘటనలో సప్నా గిల్ కూడా నిందితురాలిగా ఉంది. పృథ్వీ షా కారుపై ఆమె స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సప్నాను అరెస్ట్ కూడా చేశారు. అయితే.. తాజాగా బెయిల్‌పై విడుదలైన సప్నా గిల్, బయటకు రాగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 16న పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ స్టార్ హోటల్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఆ హోటల్‌లో ఉన్న కొంతమంది పృథ్వీ షాను సెల్ఫీ కోసం అడిగారు. వారి కోరిక మేరుకు షా వారితో ఫొటోలు దిగాడు. కానీ.. అదే పనిగా వారికి నచ్చినట్లు ఫొటోలు దిగాలని పృథ్వీ షాను ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో షా వారి వదిలించుకుని వెళ్లిపోతున్న క్రమంలో దారి మధ్యలో అటకాయించి, షా ప్రయాణిస్తున్న కారుపై బేస్ బాల్ స్టిక్స్‌తో దాడికి తెగబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశాడు. అయితే.. ఈ కేసులో ఇన్‌స్ట్రాగామ్ మోడల్ సప్నా గిల్ కూడా అరెస్ట్ అయి కొన్ని రోజలు రిమాండ్‌లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చారు.
సప్నా గిల్ ఫిర్యాదులో పేర్కొన్నది ఇదే.. ‘నేను నా స్నేహితుడు శోభిత్ ఠాకూర్ అప్‌మార్కెట్ క్లబ్‌కు తరచుగా వెళ్తుంటాం. అక్కడ పృథ్వీ షా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ తాగి ఉన్నాడు. మిస్టర్ ఠాకూర్ క్రికెట్‌పై ఉన్న అభిమానంతో పృథ్వీ షాను సెల్ఫీ అడిగాడు. దీంతో పృథ్వీ షా అతని స్నేహితులు ఠాకూర్‌పై దాడికి దిగారు. ఠాకూర్‌ను వారి నుంచి రక్షించేందుకు, గొడవను అడ్డుకునేందుకు నేను కూడా వెళ్లాను, వారి నాపై కూడా దాడి చేశారు. మమ్మల్ని వదిలేయాలని పృథ్వీ షాను నేను వేడుకున్నాను.’ అని సప్నా గిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చెంపపై, చెస్ట్‌పై పృథ్వీ షా కొట్టినట్లు సప్నా ఒక వీడియోలో సైతం వెల్లడించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Accused #Sapnagill Version.#PrithviShaw pic.twitter.com/RDpPAEfzRl
— Vivek Gupta (@imvivekgupta) February 17, 2023
#SapnaGill, a third-rated internet influencer, allegedly assaults cricketer #PrithviShaw & damages his vehicle after he refuses a selfie with her. She demands ₹50,000 after chasing him down & threatens to implicate him in a false case if refused. #MenToo pic.twitter.com/LAyEG2zzCq
— Dobby (@DobbyDog555) February 17, 2023
This girl asked Prithvi Shaw for fifty thousand rupees, when he did not give the money, then the girl started a ruckus and accused him of beating her.#PrithviShaw #Sapnagill pic.twitter.com/W2jt4eXY1x
— Ram Yadav🇮🇳💙 (@_yadavRam) February 17, 2023