త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే జస్ప్రీత్ బుమ్రాకు పాత గాయం తిరగబెట్టడంతో అతను వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే బౌలింగ్ సమస్యలతో సతమతమవుతున్న టీమిండియాకు బుమ్రా లేకపోవడం పెద్ద లోటే. ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రా ఎంత ఎఫెక్టివ్‌గా ఉండాడో అందరికి తెలిసిందే. అలాంటి ప్రధాన బౌలర్ లేకుండా భారత్ టీ20 వరల్డ్ కప్ వెళ్తుంది. బుమ్రా గైర్హాజరీ కచ్చితంగా టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. యువ పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్‌తో పాటు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్నా.. బుమ్రా లేని లోటును పూడ్చలేరు. కాగా.. బుమ్రా స్థానంలో టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నా.. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు సైతం వరల్డ్ కప్ టీమ్‌లోకి తెలుపులు తెరుచుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022కు షమీని పక్కనపెట్టారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడం.. టీమిండియా ప్రదర్శన దారుణంగా ఉండటంతో తిరిగి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌కు సెలెక్టర్లు షమీని ఎంపిక చేశారు. కానీ దురదృష్టం కొద్ది అప్పుడే షమీ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. వరల్డ్ కప్ సమయానికి షమీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కానీ.. షమీకి కార్డియో వాస్క్యులర్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఈ టెస్ట్‌లో పాసైతేనే అతను జట్టులోకి వస్తాడు. లేదంటే అతను వంద శాతం ఫిట్‌గా లేడని సెలెక్టర్లు పరిగణించే అవకాశం ఉంది. కాగా.. మొహమ్మద్ సిరాజ్‌కు ఉన్న ఏకైక అడ్డు షమీనే. అతను పూర్తి ఫిట్‌గా లేకపోతే సిరాజ్‌కు తొలి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కడం ఖాయం.
సిరాజే ఎందుకు..?
ఆస్ట్రేలియా పిచ్‌లపై సిరాజ్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని, పేస్‌తో పాటు బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడం సిరాజ్ ప్రధాన బలం. ఇప్పుడు ఇదే విషయం సెలెక్టర్లను సిరాజ్ వైపు మొగ్గుచూపేలా చేస్తుంది. టీ20ల్లో సిరాజ్‌కు మంచి రికార్డు కూడా ఉంది. అలాగే సిరాజ్ టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది ఆస్ట్రేలియాలోనే. తన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు సాధించి అదరగొట్టాడు. జట్టులోకి వచ్చిన కొత్తలోనే ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ గాయాలతో జట్టులకు దూరమైతే.. బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. ఇప్పుడు కూడా బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి సిరాజ్ మంచి ఎంపిక అవుతాడని క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. కొత్త బంతితో నిప్పులు చెరిగే సిరాజ్ డెత్ ఓవర్స్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. బుమ్రాతో పోల్చుకుంటే కొంచెం పరుగులు ఎక్కువగా ఇచ్చినా.. మంచి వికెట్ టేకింగ్ బౌలర్. జట్టుకు అవసరమైన సమయంలో వచ్చి బ్రేక్‌త్రూ అందించగలడు. తాజాగా సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ20ల కోసం బుమ్రా స్థానంలో సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Bumrah out of the World Cup. Shami/Siraj likely replacement for Bumrah #BreakingNews
— Vikrant Gupta (@vikrantgupta73) September 29, 2022
Who is the Best Replacement of Jasprit Bumrah
1.Shami (Like)
2.Siraj (Retweet) #TeamIndia #T20WorldCup2022 pic.twitter.com/JwP5q8cn00— Hye Sports (@hyesports1) September 29, 2022
ఇది కూడా చదవండి: లేస్తే ధోనిని తిట్టే గంభీర్.. సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌ను నాశనం చేశాడా?