టీమిండియా స్టార్ పేసర్.. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కు కోహ్లీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని సిరాజ్ ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే ఉంటాడు. సిరాజ్ కు ఐపీఎల్ 2022లో వేరే టీముల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కూడా ఆర్సీబీ రిటైన్ ఆఫర్ చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువే ఇస్తామన్నారు. కానీ, అవన్నీ వదులుకొని ఆర్సీబీ రిటైన్ ప్లేయర్ గా ఉండిపోయింది కేవలం కోహ్లీ కోసం మాత్రమే అనే విషయం అందరికీ తెలుసు. ప్రతిసారి సిరాజ్ తన ప్రేమ బయటపెట్టడమే కాదు.. ఓసారి కోహ్లీ కూడా సిరాజ్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆర్సీబీ పాడ్ కాస్ట్ లో.. స్వయాన సిరాజే ఆ విషయాన్ని బయట పెట్టాడు.
విరాట్ కోహ్లీ టోలీచౌకీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సిరాజ్ భావోద్వైగానికి గురయ్యాడు. ‘ఓ రోజు ఆర్సీబీ ఆటగాళ్లు అందరినీ నేను నా ఇంట్లో విందుకు ఆహ్వానించాను. అందరూ అందుకు సరే అన్నారు. కానీ, విరాట్ భయ్యా మాత్రం రాలేను అని చెప్పాడు. ఆ రోజు భయ్యాకి బాగా వెన్నునొప్పి ఉంది. అందుకే రాలేనని చెప్పేశాడు. నేను కూడా సరే భయ్యా రెస్ట్ తీసుకోండి అని చెప్పాను.
తర్వాత ఒక్కొక్కరిగా మా ఇంట్లోకి వస్తున్నారు. మొదట పార్థివ్ పటేల్ భయ్యా, చాహల్ భయ్యా వచ్చారు. ఆ తర్వాత కారులోంచి దిగుతూ విరాట్ భయ్యా కనిపించాడు. నా జీవితంలో బెస్ట్ సర్ ప్రైజ్ అది. రానని చెప్పి కోహ్లీ భయ్యా రావడంతో ఆనందంతో వెళ్లి గట్టిగా హత్తుకున్నాను’ అంటూ కోహ్లీ టోలీచౌకీకి వచ్చిన విషయాన్ని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు.