హైదరాబాద్ గల్లీల నుంచి భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగిన టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్థానం స్ఫూర్తి దాయకం. 2017లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్ మొదట్లో జట్టులోకి వస్తూ.. పోతూ ఉండేవాడు. గత ఏడాది కాలంగా అన్ని మాత్రం టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లో సిరాజ్.. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌తో సిరాజ్‌ను కూడా ఆర్సీబీ రిటేన్ చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సిరాజ్ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌కు చిన్న ఇంటర్య్వూ ఇచ్చాడు.
తన కెరీర్ ఎలా ప్రారంభం అయిందనే విషయాన్ని సిరాజ్ ఆసక్తికరంగా వివరించాడు. ”నా కెరీర్ విషయమై అమ్మ, నాన్న ఎప్పుడు గొడవపడుతుండేవారు. నేను జాబ్ చేయాలా లేక చదువుకోవాలా అనే దానిపై రోజు పెద్ద చర్చ నడిచేది. కానీ నాకు ధ్యాసంతా క్రికెట్‌పైనే.. చదవడం, జాబ్ చేయడం ఇష్టం లేదు. ఈ విషయం అమ్మానాన్నకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మా మామయ్య నాకు అండగా నిలిచాడు. ఒకరోజు గొడవ జరుగుతున్న సందర్భంలో మామయ్య ఇంటికి వచ్చాడు. అతనికి ఒక క్రికెట్ క్లబ్ ఉంది. మావాళ్లు చెప్పిందంతా విన్న మామయ్య.. వాడిని(సిరాజ్) క్లబ్‌కు తీసుకెళుతాను. అక్కడికి వచ్చి సిరాజ్ క్రికెట్ ఆడతాడు.. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం అన్నాడు. నేను సరే అని ఒప్పుకున్నా.
ఆడిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశా. నా ప్రదర్శన చూసిన మామయ్య ఆశ్చర్యపోయి.. ఇంత బాగా ఆడతావని ఊహించలేదన్నాడు. వెంటనే నాన్నకు ఫోన్ చేసి.. వాడిని చదవమని.. జాబ్ చేయమని బలవంతం చేయొద్దు.. నచ్చింది చేయనివ్వండి. సిరాజ్‌కు అండగా నేనుంటా.. ఖర్చులన్నీ భరిస్తా అని చెప్పి ఐదు వందలు రూపాయలు నా చేతిలో పెట్టాడు. బహుశా అదే నా తొలి సంపాదన అనుకుంటా. అందులో మూడు వందలు నా కుటుంబానికి ఇచ్చి.. మిగతా రెండు వందల రూపాయాలు నా దగ్గరే పెట్టుకున్నా. ఒక రకంగా నేను క్రికెట్‌లో అడుగుపెట్టడానికి మామయ్య పరోక్షంగా కారణం అయితే.. ప్రత్యక్షంగా ఆ 9 వికెట్లు ఉంటాయి. నిజానికి ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి.. లేకుంటే ఈరోజు ప్రపంచస్థాయి బౌలర్‌ను మీరు చూసి ఉండరు” అంటూ చెప్పుకొచ్చాడు. అలా వాళ్ల మామయ్య తనను తీసుకెళ్ల కుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే వాడు కాదు. కాగా సిరాజ్ ఇప్పటి వరకు టీమిండియా తరపున 4 టెస్టులు, 2 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు. మరి సిరాజ్ కెరీర్ ప్రారంభంపై, ప్రస్తుత ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The RCB Podcast: Mohammed Siraj’s rise to stardom@mdsirajofficial talks about his earliest memory of playing cricket, struggling years trying to make it big in the world of cricket, and plenty of other anecdotes in the #RCBPodcast powered by @KotakBankLtd. #PlayBold pic.twitter.com/t12VHUXHB2
— Royal Challengers Bangalore (@RCBTweets) March 1, 2022